అన్నదానం నిర్వహించడం అభినందనీయం.
న్యూస్‌తెలుగు/ కొమురం భీం/ ఆసిఫాబాద్ జిల్లా : కాగజ్ నగర్ పట్టణంలోని కిమ్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో మెమోరియల్ సర్వీస్ సొసైటీ వారి ఆధర్వంలో కంటి ఆపరేషన్ కోసం వచ్చినవారికి అన్నదానం నిర్వహించారు.కిమ్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డా.కొత్తపల్లి శ్రీనివాస్, డా.కొత్తపల్లి అనిత ప్రతి శనివారం నిర్వహించే ఉచిత కంటి పరీక్షలో భాగంగా 11 మందికి ఆపరేషన్ నిమిత్తం వారికి భోజనం సదుపాయం, ప్రయాణ చార్జీలు సమకూర్చి వారిని నేడు బెల్లంపల్లి లయన్స్ కంటి ఆస్పత్రికి పంపించినట్లు డా.కొత్తపల్లి శ్రీనివాస్ డా.కొత్తపల్లి అనిత తెలిపారు. ప్రతి మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. వారు చేసిన సహాయానికి కంటి ఆపరేషన్ కు వచ్చిన వారు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్,అనిత దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. (Story : అన్నదానం నిర్వహించడం అభినందనీయం)