సత్య కళాశాలలో ప్రపంచ జనాభా దినోత్సవం
న్యూస్‌తెలుగు/విజయనగరం: స్ధానిక తోట పాలెం లో ఉన్న సత్య డిగ్రీ మరియు పీజీ కళాశాలలో గురువారం ప్రపంచ జనాభా దినోత్సవం ను నిర్వహించారు. ప్రపంచ జనాభా సమస్యలు, సమాజం పై జనాభా పెరుగుదల ప్రభావం గురించి అవగాహన కల్పించడానికి ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నాం అని, భూమి మీద జనాభా భారం పెరుగుతున్న కొద్దీ మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది అని, జనాభా పెరుగుదల ప్రభావాలను గుర్తించి పరిష్కారం అన్వేషించే అవగాహన కోసమే ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నాం అని కళాశాల సంచాలకులు డాక్టర్ ఎం శశి భూషణ రావు తెలియజేశారు. ఐక్యరాజ్య సమితి ప్రారంభించిన ఈ జనాభా దినోత్సవం ముఖ్యంగా కుటుంబ నియంత్రణ, జనాభా పెరుగుదల కారణంగా చోటు చేసుకున్నటువంటి ఆందోళనలు వాటిని పరిష్కరించడం మొదలయిన విషయాలను నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోవడం తో పాటు, మన భూమిని కాపాడుకోవలసిన అవసరంను తెలియజేయటం కోసం ఈ ప్రపంచ జనాభా దినోత్సవం ను జరుపుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వి.సాయి దేవమణి అన్నారు.ఈ కార్య్రమంలో కళాశాల ఎన్ ఎస్ ఎస్ ఆఫీసర్ బి.సూరపు నాయుడు, ఎన్ సి సి ఆఫీసర్ ఎం. ఉదయ్ కిరణ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. (Story: సత్య కళాశాలలో ప్రపంచ జనాభా దినోత్సవం)