7న శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవం
విశాలాంధ్ర/విజయనగరం: పట్టణంలోని దాసన్నపేట శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవం వచ్చే నెల 7న జరుగనున్న నేపథ్యంలో ఆదివారం శ్రీ స్వామి వారికి పలువురు దాతలు, స్థానికులు 13లక్షలరూపాయలఖర్చుతో నిర్మించిన పెద్దరథాన్ని, సంతపేటకుచెందిన శ్రీ జగన్నాథ స్వామి వారి భక్తులు శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి తిరువీధోత్సవం నిమిత్తం ఆలయానికి బహుకరించారు. దేవస్థానం ఎసి మరియు ఇఓ.డివివిప్రసాదరావు పర్యవేక్షణలో మంగళవాద్యాలనడుమ దాసన్నపేట శ్రీ జగన్నాథ స్వామి వారి ఆలయం వద్ద నిలిపిన రథాలకు ఆలయ ప్రాంగణంలో పుణ్యాహవచనం, పూజలు, శాంతి హోమం నిర్వహించారు. అనంతరం రథచక్రాలకు సంప్రోక్షణలు చేసి కొబ్బరికాయ కొట్టి, మంగళహారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రాకురిఠి రామక్రుష్ణాచార్యులు, దేవస్థానం వేదపండితులు, సీనియర్ సూపరింటెండెంట్ సహాయకులు ఏడుకొండలు , సిబ్బంది, దాతలు పాల్గొన్నారు.దాతలకు దేవస్థానం తోపాటు భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. గత కొన్నేళ్లుగా పెద్దరథం పూర్తిగా పాడయినందున శ్రీ స్వామి వారి ఉత్సవమూర్తులు బల్లలేవేదిక కావడం శోచనీయం అయినవిషయం విదితమే. ఈ ఏడాది నూతనంగా ప్రత్యేక రథాలపై శ్రీ స్వామి వారు దర్శనం ఇస్తారని తెలియడంతో భక్తులు రధాలను తిలకించడానికి విచ్చేసి హర్షం ప్రకటించారు. (Story: 7న శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవం)