త్రిశూల వ్యూహంలో వైసిపి గల్లంతు
25 వేల మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టిన ప్రభుత్వం
సిద్ధం సభకు రావద్దంటూ మీడియాకు పోలీసులు ఆంక్షలు చేస్తూ నోటీసులా?
మాజీ మంత్రి పితాని సత్యనారాయణ
పెనుమంట్ర (న్యూస్ తెలుగు): తెలుగుదేశం, జనసేన, బిజెపి త్రిశూల వ్యూహంలో రాష్ట్రంలో వైసిపి గల్లంతవ్వటం ఖాయమని మాజీ మంత్రి టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ అన్నారు. ఆదివారం పెనుమంట్ర మండలం మాముడూరు గ్రామంలో ప్రజల వద్దకు పితాని ఎన్నికల పాదయాత్రను నిర్వహించారు. అడుగడుగునా యువకులు, మహిళలు పూల వర్షం కురిపిస్తూ నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా పితాని సత్యనారాయణ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి, జనసేన కూటమి తో పాటు బిజెపి కలవడం ఇది చారిత్రాత్మిక ఘట్టమనే అన్నారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి అరాచక హత్య రాజకీయాలతో ఎందరినో పొట్టన పెట్టుకున్నారని అవేదన వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాలను, షెడ్యూల్ కులాలను హత్య చేసి అక్రమ కేసులు పెట్టి అరాచక ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం అని అన్నారు. రాష్ట్రంలో 26,000 వేల మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పారు. ప్రజాస్వామ్యంలో నాలుగు పాదాలలో ఉన్న పాత్రికేయ హక్కులను కాలరాసే విధంగా పోలీస్ వ్యవస్థ ద్వారా నోటీసులు జారీ చేయడం దుర్మార్గమని అన్నారు. సిద్ధం సభకు మీడియా సంస్థలు రావొద్దు అంటూ పోలీసులు నోటీసులు జారీ చేస్తారా అంటూ మండిపడ్డారు. సిద్ధమా సిద్దమా అంటున్నారు.మీరు హత్య రాజకీయాలకు సిద్ధమా, అరాచక పాలనకు సిద్ధమా, దేనికి సిద్ధమంటూ సూటిగా ప్రశ్నించారు. తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి ఓటేయాలని ప్రజల అభ్యర్థిస్తున్నామని అన్నారు. యువతకు జాబ్ క్యాలెండర్ లేకుండా ఇచ్చిన హామీ నెరవేర్చలేని జగన్ రెడ్డి ప్రభుత్వంని ఓటు హక్కుతో ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, యువత, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. (Story: త్రిశూల వ్యూహంలో వైసిపి గల్లంతు)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!