టిడిపిలో ముఠాలపై సారధి ఉక్కు పాదం!
కంగు తింటున్న ప్రముఖ నాయకులు
ఈవీ శ్రీనివాస్ (న్యూస్ తెలుగు-చాట్రాయి) : తెలుగుదేశం పార్టీలో ముఠా నాయకుల ఎత్తులు పై ఎత్తులు వ్యూహాలను చిత్తుచేస్తున్న పార్థసారధి పార్టీ కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాల్సిందేనని ఆదేశించినట్లు విశ్వనీయ వర్గాల కథనం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నూజివీడు నియోజకవర్గ శాసనసభ స్థానం అభ్యర్థిత్వం మారిన దగ్గర నుండి చాట్రాయి మండలంలో తెలుగుదేశం పార్టీలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సుదీర్ఘ కాలం ప్రత్యర్థులుగా ఉన్నవారు… ఒకళ్ళ ఫ్లెక్సీలు మరొకరు చింపేసుకోవడం మా ఫ్లెక్సీ తీస్తే డాబా పై నుండి దూకుతామనడం, ఫ్లెక్సీలు వివాదం పై సాక్షాత్తు జిల్లా ఎస్పీ చాట్రాయి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సందర్భాలు లేకపోలేదు. అది అప్పటి నియోజకవర్గ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు నాయకత్వంలో జరిగిన ఘటనలు ….. గ్రామ టిడిపి అధ్యక్ష పదవి ఎన్నిక కోసం పోలీసు బలగాలు మోహరింపు వంటి ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయి. కట్ చేస్తే సారధి నాయకత్వంలో ప్రత్యర్థులందరూ ఒకే ఫ్లెక్సీ పై ఫోజులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యూహాత్మకంగా మండల పార్టీ అధ్యక్ష పదవి దివంగత నేత బొట్టు విజయ్ చౌదరి సతీమణి బొట్టు వరలక్ష్మికి ఇటీవలే దక్కిన విషయం తెలిసిందే. లక్ష్మీ పేరుని అడ్డుపెట్టుకొని కొంతమంది కాకలు తీరిన నాయకులు మండల పార్టీ పై ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేయడంతో వారి కుటుంబ సభ్యులు అడ్డుకున్నట్లు తెలిసింది. ఈ సందర్భంలోనే సారథి జోక్యం చేసుకొని ఎవరికి వారే ఇష్టారాజ్యంగా వ్యవహరించవద్దని సమన్వయం తోనే మండల పార్టీ నడిపించాలని ఖరాఖండిగా ఆదేశించినట్లు తెలుస్తోంది. కొద్దిమంది నాయకులు వారికున్న సుదీర్ఘ అనుభవంతో సారధి అనుయాయులను సైతం వారి ట్రాప్ లో పెట్టే ప్రయత్నం చేస్తుండగా వాటిని కూడా సారధి నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సారధి సారధ్యంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే తిప్పలు తప్పవని అందరూ చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. (Story: టిడిపిలో ముఠాలపై సారధి ఉక్కు పాదం!)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!