ఉపాధి హామీలో చెరువు తవ్వకాల తీరు చూశారా?
పెనుమంట్ర (న్యూస్ తెలుగు): మిషన్ అమృత్ సరోవర్ లో భాగంగా మండలంలో వివిధ గ్రామాల్లో చెర్వవుల తవ్వకం పనుల్లో భారీ అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండల స్థాయిలో సరైన పర్యవేక్షణ లేకపోవడం, ఏళ్ల తరబడి పాతుకుపోయిన ఉద్యోగులు, క్షేత్రస్థాయిలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సిబ్బంది…. ఇది మండలంలో ఉపాధి హామీ పథకం నిర్వహణ తీరు. పెనుమంట్ర మండలంలో 2022లో వివిధ గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం పథకాలలో భాగంగా చెర్వువుల తవ్వకం చేశారు.
వీటిలో మాముడూరు చెర్వు ఒకటి. దీనిని రూ1.97 లక్షల వ్యయంతో తవ్వకం, ఇతర పనులు చేశారు. ప్రస్తుతం ఈ చెర్వువు తీరు చూస్తే అసలు పనులు చేశారా అన్నట్లుగా మారింది. కేంద్ర ప్రత్యేక బృందం వస్తుందనే ఉద్దేశంతో గతంలో చెర్వువును హడావిడిగా శుభ్రం చేసి చేతులు దులుపుకున్నారు. తర్వాత మళ్లీ చెర్వువు యధాస్థితికి చేరుకుంది. మండలంలో ఈ చెర్వువుల తవ్వకం చేసిన సందర్భంలో కూలీల మస్తర్లు విషయంలో పెద్ద ఎత్తున గోల్ మాల్ జరిగినట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయమై ఉన్నత అధికారులు స్పందించి విచారణ చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. (Story: ఉపాధి హామీలో చెరువు తవ్వకాల తీరు చూశారా?)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!