Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌బహుజన భేరికి తరలి రండి

బహుజన భేరికి తరలి రండి

బహుజన భేరికి తరలి రండి

బిఎస్పీ రాష్ట్ర కార్యదర్శి సోము రాంబాబు పిలుపు

విజయనగరం (న్యూస్ తెలుగు) : బహుజనులకే రాజ్యాధికారం లక్ష్యంగా బహుజన్ సమాజ్ పార్టీ(బిఎస్పీ) ఈనెల 15 న, సాయంత్రం 4 గంటలకు విజయవాడలోని విద్యాధరపురం లేబర్ కాలనీ గ్రౌండ్ లో తలపెట్టిన ‘బహుజన భేరి’ కి బహుజనులంతా తరలి రావాలని బిఎస్పీ రాష్ట్ర కార్యదర్శి సోము రాంబాబు పిలుపునిచ్చారు. ఆదివారం జమ్ములోని తమ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో అయన మాట్లాడారు. త్వరలో దేశంలో, రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలకు తమ పార్టీ ప్రచార సన్నద్దతకు ఈ బహుజన భేరి నాంధి అని ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనతో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, క్రిస్టియన్, ముస్లిం మైనార్టీలు అణగదొక్కబడ్డారని ద్వజమెత్తారు. ఈ ప్రభుత్వ పాలనలో బహుజనులకి రక్షణ లేదు, అభివృద్ధి లేదు, యువతకు ఉపాధి లేదని దుయ్యబట్టిన అయన చివరికి దళితులు సాగుచేసుకుంటున్న భూములను సైతం ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి దారుణ పరిస్థితులకు కారణం ఈ రాజ్యంలో బహుజనులకి రాజ్యాధికారం లేకపోవడమేనని బహుజన్ సమాజ్ పార్టీ భావిస్తోందని అన్నారు. అందుకే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బహుజనులకు రాజ్యాధికారం దక్కేలా, బీసీ ని ముఖ్యమంత్రిని చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ ముందు నుంచి కృతనిశ్చయంతో ఉందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని స్థానాలోనూ బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయబోతుందన్నారు. సుమారు వంద స్థానాల్లో బీసీలను నిలపాలన్నదే బహుజన్ సమాజ్ పార్టీ ఏకైక నిర్ణయమని అన్నారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా బహుజనులను అందరినీ కూడగట్టి బహుజనులకు రాజ్యాధికారం రావాలన్న నినాదంతో తమ బహుజన్ సమాజ్ పార్టీ ముందుకు వెళ్తుందని అన్నారు. అదేవిదంగా జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్ స్థానానికి కూడా బహుజన్ సమాజ్ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. బెహన్జీ కుమారి మాయావతి ఆదేశానుసారం ఈ రాష్ట్రంలో బీసీ లకు ఎక్కువ స్థానాలు కేటాయించాలన్నదే బిఎస్పీ ఏకైక లక్ష్యం. అందులో భాగంగా బీసీ ల్లోని అణగారిన వర్గాలను కలుపుకొనిపోయి, ఈ రాష్ట్రంలో వారికి వంద స్థానాల్లో ప్రాతినిధ్యం కల్పించాలన్నదే బిఎస్పీ ఏకైక లక్ష్యమని సోము రాంబాబు ఉద్ఘాటించారు. ఈ మేరకు జిల్లాలోని బహుజనులంతా ఈనెల 15న విజయవాడలో జరిగే బహుజన భేరికి తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బిఎస్పీ జిల్లా ఇంచార్జ్ అర్జి శివ ప్రసాద్, రాజాం ని.వ.ఇంచార్జ్ బొత్స బుద్ధుడు, అధ్యక్షుడు దేబార్కి రామప్పడు, విజయనగరం ని.వ. ఇంచార్జ్ అర్జి పైడిరాజు, నెల్లిమర్ల ని.వ. అధ్యక్షుడు ఎరుకొండ వెంకటరావు, పార్టీ కార్యవర్గ సభ్యుడు అశోక్ అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. (Story: బహుజన భేరికి తరలి రండి)

See Also

మ‌రో ముగ్గురు ఎంపీల జంప్‌!

తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా కే.శ్రీ‌నివాస్‌రెడ్డి

బీజేపీ దారెటు?

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!