భోగాపురంలో భూస్థాపితమైన వైయస్సార్సీపి
మండలంలో వైకాపా నేతల మూకుమ్మడి రాజీనామాలు
భోగాపురం మండలంలో వైఎస్ఆర్సిపి పార్టీకి ఎప్పటి నుండో వెన్ను దన్నుగా నిలుస్తూ వచ్చిన శ్రీనివాసు రాజు(శ్రీను బాబు ), అతని అనుచర వర్గం రాజీనామాలు
విజయనగరం (న్యూస్ తెలుగు) : విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని భోగాపురం మండలంలో వైఎస్ఆర్సిపి పార్టీ స్థాపించిన నాటి నుండి పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన కాకర్లపూడి శ్రీనివాసరాజు ఈరోజు అధికారంగా వైఎస్సార్సీపీ పార్టీకి రాజీనామా చేశారు. అలాగే శ్రీనివాసరాజు తో పాటు అతని అనుచర వర్గం అయిన 40 మంది నాయకులు పార్టీని వీడారు.
వైయస్సార్సీపి పార్టీని వీడిన కాకర్లపూడి శ్రీనివాసరాజుని నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి అభ్యర్థి అయిన లోకం మాధవి గారు అయన నివాసంలో కలిసి ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సానుకూలంగా స్పందించిన శ్రీనివాస రాజు అతి త్వరలోనే జనసేన పార్టీలోకి జాయిన్ అవుతానని లోకం మాధవికి తెలిపారు.
రాజీనామాలు చేసిన శ్రీనివాస్ రాజు అనుచరవర్గమైన 40 మంది ముఖ్య నేతలు లోకం మాధవి ఆధ్వర్యంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. మాధవి కండువాలు కప్పి వీరిని సాదరంగా జనసేన పార్టీలోకి ఆహ్వానించారు.
నాయకులు మాట్లాడుతూ పార్టీలో ప్రథమం నుండి పార్టీ అభివృద్ధి కోసం కృషిచేసినా, ఎటువంటి గౌరవం
లభించకపోగా, నెల్లిమర్ల నియోజకవర్గం లో వైఎస్ఆర్సిపి పార్టీ అభివృద్ధిని కుంటున పడేసిందని, నియోజకవర్గంలో అభివృద్ధికి కట్టుబడి శ్రమించే వ్యక్తి లోకం మాధవి గారని తెలిపారు
లోకం మాధవి మాట్లాడుతూ వైసీపీ పార్టీని వీడి జనసేన పార్టీలోకి రావడం ఎంతో సంతోషకరమని నియోజకవర్గ అభివృద్ధి కోసం అందరూ కలిసి కృషి చేద్దామని, మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించండి అని మాధవి ప్రజలను కోరారు. (Story: భోగాపురంలో భూస్థాపితమైన వైయస్సార్సీపి).
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!