మా మ్యానిఫెస్టో వస్తే వాళ్ల లుంగీలు ఊడిపోతాయ్
ఎవరూ లేక కాల్వ కింద నుంచి అభ్యర్థిని తీసుకువచ్చారు
నూజివీడు ఎమ్మెల్యే ప్రతాప్
ఈవీ శ్రీనివాస్ (న్యూస్ తెలుగు-చాట్రాయి) : నా మీద నిలబెట్టడానికి నూజివీడు లో ఒక్క మనిషి లేక తెలుగు దేశం పార్టీ కాలవ కింద నుంచి అభ్యర్థిని తీసుకువచ్చిందని నూజివీడు ఎమ్మెల్యే మేక ప్రతాప్ అప్పారావు ఎద్దేవా చేశారు. సాయంత్రం మండల కేంద్రమైన చాట్రాయి గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణంలో వైయస్సార్ చేయూత నాలుగో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. జగన్ మోహన్ మోహన్ రెడ్డి చెప్పినవి చెప్పనవి కూడా సంక్షేమ పథకాలను అందజేసిన ఘనుడు అన్నారు. చాట్రాయి మండలంలో 3586 మందికి 6కోట్ల 72 లక్షల 37 వేల 930 రూపాయల చెక్కులను అంద చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా తాను మరోసారి పోటీ చేస్తున్నానని తన మీద నిలబెట్టడానికి ఇక్కడ మనిషి లేక కాలవ కింద నుంచి మనిషిని తీసుకువచ్చారన్నారు. అతను వచ్చి మూడు వారాలు కాకముందే, నూజివీడు నియోజకవర్గంలో కనీసం అడ్రస్సులు కూడా తెలవని, ఊరు పేర్లు తెలియని వ్యక్తి ఇక్కడకు వచ్చి తనని విమర్శిస్తున్నారు అన్నారు. వైసిపి ఎన్నికల మేనిఫెస్టో వస్తే వాళ్ళ లుంగీలు కూడా ఊడిపోతాయి అన్నారు. ఎక్కడికి వెళ్లినా గ్రామగ్రామన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో ఏపీ కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ దేశిరెడ్డి రాఘవరెడ్డి, చాట్రాయి ఎంపీపీ లంక నిర్మల, వైసిపి చాట్రాయి మండల అధ్యక్షులు మిద్దె బాలకృష్ణ, వైసిపి సీనియర్ నాయకులు దామెర ప్రసాద్ బాబు, చెలికాని బాబ్జి తదితరులు పాల్గొన్నారు. (Story: మా మ్యానిఫెస్టో వస్తే వాళ్ల లుంగీలు ఊడిపోతాయ్)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!