UA-35385725-1 UA-35385725-1

NBK 109′ గ్లింప్స్ విడుదల

నందమూరి బాలకృష్ణ, బాబీ కొల్లి మరియు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘NBK 109’ గ్లింప్స్ విడుదల

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన కథానాయకులలో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఆయన సినిమాలు మాస్, స్టైలిష్, యాక్షన్ సన్నివేశాల కలబోతతో సంపూర్ణ వినోదాన్ని పంచేలా ఉంటాయి. అద్భుతమైన మాస్ డైలాగ్ డెలివరీ మరియు రాయల్ లుక్స్ కారణంగా అభిమానులు ఆయనను ‘నటసింహ’ అని ప్రేమగా పిలుస్తారు. ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ, ఇప్పుడు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లితో చేతులు కలిపారు.

రచయిత, దర్శకుడు బాబీ తన సినిమాల్లో హీరోలను కొత్తగా చూపిస్తుంటారు. అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు మెచ్చేలా ఆయన హీరోల పాత్రలను మలిచే తీరు మెప్పిస్తుంది. ఇప్పుడు బాలకృష్ణతో ఆయన కలిసి పని చేస్తుండటం.. సినీ ప్రియుల్లో మరియు నందమూరి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. వీరి కాంబినేషన్ లో కూల్ మాస్ యాక్షన్ బ్లాక్ బస్టర్ రావడం ఖాయమనే అంచనాలు అందరిలో నెలకొన్నాయి.

మార్చి 8న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘NBK109′(వర్కింగ్ టైటిల్) నుండి చిత్ర బృందం ఫస్ట్‌ గ్లింప్స్ ను విడుదల చేసింది. బాలకృష్ణ-బాబీ కాంబినేషన్ కారణంగా ఇప్పటికే ఏర్పడిన భారీ అంచనాలను.. ఈ గ్లింప్స్ మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉంది.

యాక్షన్ సీక్వెన్స్‌ తో రూపొందించిన గ్లింప్స్ లో నందమూరి బాలకృష్ణ(NBK)ను దర్శకుడు బాబీ “నేచురల్ బోర్న్ కింగ్”గా చూపించారు. కూల్‌గా, ప్రశాంతంగా కనిపిస్తూనే తనదైన శైలిలో పవర్ ఫుల్ డైలాగ్ తో అదరగొట్టారు బాలయ్య.

ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ కూలెస్ట్ మరియు క్రూయలెస్ట్ గా కనిపిస్తారని ఇప్పటికే మేకర్స్ తెలిపారు. తాజాగా విడుదలైన గ్లింప్స్ దానికి రుజువులా ఉంది. బాలకృష్ణ తన టూల్ బాక్స్‌లో ఆయుధాలతో పాటు మాన్షన్ హౌస్ ఆల్కహాల్ బాటిల్‌ ని తీసుకెళ్లడం మనం చూడవచ్చు. గూండాలు తన వైపు పరుగెత్తుకుంటూ వస్తుంటే, బాలయ్య కూల్ గా ఆల్కహాల్ తాగడం ఆకట్టుకుంది. “ఏంట్రా వార్ డిక్లేర్ చేస్తున్నావా?” అని ప్రత్యర్థి గ్యాంగ్ లోని వ్యక్తి అడగగా.. “సింహం నక్కల మీదకు వస్తే వార్ అవ్వదురా లఫూట్.. ఇట్స్ కాల్డ్ హంటింగ్” అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో  బాలకృష్ణ వేట మొదలుపెట్టడం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఇక ఈ గ్లింప్స్ ను “కల్ట్ సరుకు” అని పిలవడం మునుపెన్నడూ లేని విధంగా భారీ కిక్ ఇస్తోంది.

మొత్తానికి ‘NBK109’ గ్లింప్స్ అభిమానులను, సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నటించబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. దీంతో బాలకృష్ణ-బాబీ డియోల్ మధ్య అదిరిపోయే సన్నివేశాలను మనం ఆశించవచ్చు.

సంచలన స్వరకర్త ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ‘జైలర్’ ఫేమ్ విజయ్ కార్తీక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నిరంజన్ ఎడిటింగ్ బాధ్యత నిర్వహిస్తున్న ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు. (Story: NBK 109′ గ్లింప్స్ విడుదల)

See Also

మ‌రో ముగ్గురు ఎంపీల జంప్‌!

తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా కే.శ్రీ‌నివాస్‌రెడ్డి

బీజేపీ దారెటు?

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1