Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌బీసీ సభకు చాట్రాయి యాదవులను పిలవలేదు..ఎందుక‌ని?

బీసీ సభకు చాట్రాయి యాదవులను పిలవలేదు..ఎందుక‌ని?

బీసీ సభకు చాట్రాయి యాదవులను పిలవలేదు..ఎందుక‌ని?

ఈవి శ్రీనివాస్ (న్యూస్ తెలుగు-చాట్రాయి) : కొందరికే సారథి సొంతమా…..? బీసీలు అంటే ఎవరు….? చాట్రాయి మండలంలో బీసీ కులాలు ఎన్ని వున్నాయి….. చాట్రాయి గ్రామ యాదవులను మంగళగిరి సభకు ఎందుకు పిలవలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రమైన చాట్రాయి గ్రామంలో 600కు పైగా యాదవుల ఓటింగ్ కలిగి ఉన్నారని, గ్రామంలో పార్టీకి అండదండగా ఉన్నది యాదవులేనని ప్రతికూల పరిస్థితులలో కూడా పంచాయతీ ఎన్నికల్లో యాదవులు ప్రాబల్యం కలిగిన వార్డులో మాత్రమే గెలవడం జరిగిందని ఓసి నివాస ప్రాంతాల్లో కూడా వార్డు మెంబర్ కు ఓడి పోతుందని తెలిసినా పోటీ చేయడానికి యాదవ సామాజిక తరగతికి చెందిన మహిళలను నిలబెట్టడం జరిగిందని వారు గుర్తు చేస్తున్నారు. బీసీ సెల్ మండల మాజీ అధ్యక్షులు కంపసాటి చెన్నారావు మాట్లాడుతూ. చాట్రాయి మండలంలో బీసీలు అంటే కేవలం ఒకే ఒక కులం కాదని 11 కులాలకు పైగా ఉన్నాయని తాను మండల బీసీ సెల్ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉందని గుర్తు చేశారు. గ్రామంలో అత్యధిక ప్రాబల్యం కలిగిన సామాజిక తరగతి యాదవ సామాజిక తరగతి అన్నారు. నియోజకవర్గంలో అత్యధికంగా యాదవులు ఉన్నారనే పేరుతో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభ్యర్థిని మార్చినా మూడోసారి కూడా యాదవులకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పటికీ పార్టీ మీటింగులకు వెళ్లడానికి మాత్రం స్థానిక పెద్ద నాయకులు యాదవులను గుర్తించకపోవడం చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్న చందంగా వుందన్నారు. పార్టీ కోసం తమ ప్రాణాలను సైతం అర్పిస్తామని సారధి గెలుపే తమ లక్ష్యం అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సాగనివ్వమన్నారు. సోషల్ మీడియా విభాగం కోఆర్డినేటర్ ఎలికే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఏళ్ళ తరబడి పార్టీ కోసం పనిచేస్తున్నా మీటింగ్ గురించి కనీసం సమాచారం చెప్పలేదు అన్నారు. దేవుడు వరమిచ్చినా పూజారి అనుగ్రహం యాదవులకు రావడం లేదన్నారు. గ్రామ పార్టీ కార్యదర్శి కంపసాటి శంకర్రావు తదితరులు మాట్లాడారు. (Story: బీసీ సభకు చాట్రాయి యాదవులను పిలవలేదు..ఎందుక‌ని?)

See Also

మ‌రో ముగ్గురు ఎంపీల జంప్‌!

తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా కే.శ్రీ‌నివాస్‌రెడ్డి

బీజేపీ దారెటు?

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!