సీతంలో ఆసక్తికరంగా యూత్ పార్లమెంట్ సమావేశం
విజయనగరం (న్యూస్ తెలుగు) : స్థానిక గాజులరేగ పరిధిలో గల సీతం ఇంజనీరింగ్ కళాశాలలో, విజయనగరం జిల్లా యువ కేంద్రం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి యూత్ పార్లమెంట్ విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధికారి కె.ఉజ్వల్, మెడికల్ కౌన్సెలర్ త్రినాథ్ రావు, జిల్లా ఉపాధి అధికారి డి. అరుణ, సెట్విజ్ సిఈఓ రామగోపాలరావు, బాలల హక్కుల చైర్మన్ డాక్టర్ కె. అప్పారావు, వి.పృధ్వి, అకౌంటెన్స్ ఆఫీసర్ నెహ్రూ యువ కేంద్రం, సీతం కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణ్ రావు, ప్రిన్సిపాల్ డా. డి.వి రామమూర్తి, సీతం అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
జిల్లా యువజన అధికారి ఉజ్వల్ మాట్లాడుతూ విద్యార్థుల నైపుణ్యాలు, సహ పాఠ్యాంశాలను పెంపొందించుకోవాలని, కరెంట్ అఫైర్స్‌లో పాల్గొని రాజకీయాలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు.
వైద్య సలహాదారు త్రినాథ్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సమస్యలపై అవగాహన కలిగి ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.
జిల్లా ఉపాధి అధికారి బి.అరుణ మాట్లాడుతూ యువతకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉద్యోగావకాశాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. సెట్విజ్ సిఈఓ రామగోపాల రావు మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో విజయం సాధించేందుకు పోటీతత్వాన్ని పెంచుకోవాలని సూచించారు. బాలల హక్కుల చైర్మన్ డా.కేసలి అప్పారావు మాట్లాడుతూ విద్యార్థులు పోటీతత్వాన్ని పెంపొందించుకోవాలని, శారీరక, మానసిక శక్తిని పెంపొందించుకుని జీవితంలో లక్ష్యాలను సాధించాలన్నారు. సీతం డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు మాట్లాడుతూ విద్యార్థులు విద్య మరియు సామాజిక అంశాలలో చురుకుగా ఉండాలని సూచించారు. సీతం ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి. రామమూర్తి మాట్లాడుతూ విద్యార్థుల కెరీర్ పట్ల క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. సీతం విద్యార్థులు మాక్ పార్లమెంట్ సెషన్‌తో పాటు,సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. (Story: సీతంలో ఆసక్తికరంగా యూత్ పార్లమెంట్ సమావేశం)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!