ఎలక్షన్ సామాగ్రి సరఫరా కొరకు టెండర్లు
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ
భీమవరం (న్యూస్ తెలుగు): రాబోయే సార్వత్రిక ఎన్నికలకు జిల్లాలోని 1,754 పోలింగ్ స్టేషన్‌లకు స్టేషనరీ సామాగ్రి సరఫరా చేయడానికి ఆసక్తిగల ఏజెన్సీల నుండి స్వల్ప వ్యవధి సీల్డ్ టెండర్లను కోరుచున్నట్లు జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆసక్తి గల ఏజెన్సీలు నేటి నుండి ఈనెల 7వతేదీ మధ్య అన్ని పనిదినాల్లో ఉదయం గం.11 నుండి సాయంత్రం గం. 4ల వరకు భీమవరం కలెక్టరేట్ కార్యాలయంలోని కోఆర్డినేషన్ సెక్షన్ నందు టెండర్ ఫారమ్‌లను పొందాలని తెలిపారు. సీలు చేసిన టెండర్లను ఈనెల 7న సాయంత్రం గం.4ల లోపుగా కోఆర్డినేషన్ సెక్షన్, భీమవరం కలెక్టర్ కార్యాలయం వద్ద టెండర్ బాక్స్‌లో వేయాలన్నారు. ఈనెల 7వ తేదీ సాయంత్రం గం.5లకు భీమవరం కలెక్టర్ ఛాంబర్‌లో టెండర్లు తెరవబడతాయని, అదే రోజు టెండర్ ఫైనల్ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. (Story: ఎలక్షన్ సామాగ్రి సరఫరా కొరకు టెండర్లు)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!