జడ్పీటీసీ..పేరేది..?
చాట్రాయి (న్యూస్ తెలుగు) : చాట్రాయి మండల పరిషత్ కార్యాలయంలో జడ్పీటీసీ చెలికాని అనూష పేరుకు చోటు లేకపోవడం చర్చనీయాంశమవుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పాలన కాలంలో మహిళలు, దళితులు, బలహీన వర్గాల వారికి గిరిజనులకు గొప్ప గొప్ప అవకాశాలు కల్పిస్తున్నానని, ఎన్నడూలేని గౌరవం ఇస్తున్నానని గోరంతర కొండంతలుగా ప్రచారం చేస్తున్న ఆచరణలో అడుగు ముందుకు వేయడం లేదు అనడానికి ఈ యథార్థ సంఘటన అద్దం పడుతుందని పలువురు అంటున్నారు. వైఎస్ఆర్‌సీపీ కంచుకోట అయిన చాట్రాయి మండల పరిషత్ లో పాలకవర్గం పేర్లు ఒక పట్టిక పైన నూజివీడు ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ పేర్లు మరో పట్టిక పైన నమోదు చేశారు. వైసిపికి చెందిన ప్రజా ప్రతినిధి, విద్యావేత్త అయిన జడ్పిటిసి చెలికాని అనూష పేరుకు మాత్రం ఎక్కడా పేరులేకపోవడం గమనార్హం. ఇదే విషయమై ఎంపీడీవో మంగా కుమారిని న్యూస్ తెలుగు వివరణ కోరగా ఆమె మాట్లాడుతూ. తాను కొత్తగా ఇటీవలే వచ్చానని జడ్పీటీసీ పేరు నమోదు చేయిస్తామనని తెలిపారు. (Story: జడ్పీటీసీ..పేరేది..?)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!