బాధిత కుటుంబాలకు ఎల్ఓసీలు అందజేసిన ఎమ్మెల్యే
వనపర్తి (న్యూస్ తెలుగు) : పలు ఆరోగ్య సమస్యలతో హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వనపర్తి నియోజకవర్గం వివిధ గ్రామాలకు చెందిన బాధితులకు మంగళవారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఎల్ఓసీలను అందజేశారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామానికి చెందిన అనంతమ్మకు 2లక్షల 50 వేలు, గోపాల్పేట మండలం ఏదుల గ్రామానికి చెందిన నరేందర్ కు లక్ష రూపాయల, ఖిల్లా ఘనపురం మండల కేంద్రానికి చెందిన నాగరాజు కు 1,80,000 విలువ గల ఎల్ఓసీలను ఎమ్మెల్యే హైదరాబాదులోని తన కార్యాలయంలో బాధిత కుటుంబాలకు అందజేశారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమ కుటుంబాలకు ఎల్ఓసీలు అందజేసి తమను ఆదుకున్న ఎమ్మెల్యే కి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. (Story: బాధిత కుటుంబాలకు ఎల్ఓసీలు అందజేసిన ఎమ్మెల్యే)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!