బాధితులను పరామర్శించిన లోకం మాధవి
విజయనగరం (న్యూస్ తెలుగు) : విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని, చోడుపిల్లి పేట గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించడంతో ఇల్లు దగ్ధమై 20 లక్షల ఆస్తినష్టం జరిగిన ఘటన పట్ల జనసేన-తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి లోకం మాధవి విచారం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే లోకం మాధవి సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకొని బాధితులను పరామర్శించి నిత్యవసర వస్తువులు అందజేసి ఆర్థిక సహాయం చేశారు. అలానే బాధితులకు భవిష్యత్తులో అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముక్కం పంచాయతీ నాయకులు మైలపల్లి అనిల్ కిరణ్, బడి జీకే, బడే అనిల్, వందనాలు రమణ, పల్లా రాంబాబు, పల్లంట్ల జగదీష్ పాల్గొన్నారు. (Story: బాధితులను పరామర్శించిన లోకం మాధవి)
See Also:
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!