UA-35385725-1 UA-35385725-1

పార్లమెంట్ ఎన్నికలపై వ‌న‌ప‌ర్తి క‌లెక్ట‌ర్ ఆదేశాలు

పార్లమెంట్ ఎన్నికలపై వ‌న‌ప‌ర్తి క‌లెక్ట‌ర్ ఆదేశాలు

నోడల్ అధికారులు నిబద్ధతతో విధులు నిర్వహించాలి
వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

వనపర్తి (న్యూస్ తెలుగు) : రానున్న పార్లమెంటు ఎన్నికలకు నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధులను నిబద్దతతో బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పార్లమెంటు ఎన్నికల సంసిద్ధతపై అదనపు కలెక్టర్ యం. నగేశ్ తో కలిసి నోడల్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించి విధుల పట్ల దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నోడల్ అధికారులందరూ వారికి కేటాయించిన విధులను, బాధ్యతలను ఎన్నికల నిబంధనల ప్రకారం బాధ్యతాయుతంగా నిర్వర్తించాలన్నారు. ప్రతి ఒక్క అధికారి ఎన్నికలకు సంబంధించి భారత ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను ప్రతి పేజిని తప్పనిసరిగా చదవాలని సూచించారు. ఎన్నికల విధులు సక్రమంగా పూర్తి చేసేందుకు నోడల్ అధికారులు అవసరమైన సిబ్బందిని ముందుగానే ఎంపిక చేసుకొని వారికి సరైన శిక్షణ ఇవ్వాలని తెలియజేశారు. ఎన్నికల విధుల్లో అధికారులు ఎలాంటి పక్షపాతం, నిర్లక్షం లేకుండా బాధ్యతాయుతంగా పని చేయాలని ఆదేశించారు. వచ్చే వారం రోజుల్లో సెక్టర్ అధికారులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఎన్నికల సమయంలో పోస్టల్ బ్యాలట్ కు సంబంధించి సమస్యలు లేకుండా చూడాలని సూచించారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖ అధికారులకు సూచించారు. అధికారులంతా సమన్వయం చేసుకొని ఎన్నికల విధులు నిర్వహించాలని, అప్పుడే సమస్యలు రాకుండా చేయవచ్చని చెప్పారు. ఓటు ప్రాధాన్యత, ఓటు హక్కుపై కళాశాలల్లో స్వీప్ యాక్టివిటీ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, సీ విజిల్, ఫిర్యాదుల స్వీకరణ, పోస్టల్ బ్యాలెట్ అలాగే పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు పలు అంశాలపై నియమింపబడిన నోడల్ అధికారులు వారి విధులు జగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. ఈవీఎంల తరలింపు, అదేవిధంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే సెక్టర్ అధికారులకు వాహనాల కేటాయింపు, పోలింగ్ సిబ్బందికి కావల్సిన వాహనాలు పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు. జీపీఎస్ ట్రాకింగ్ మానిటరింగ్ వాహనాలు కూడా సిద్ధంగా ఉంచాలని సూచించారు. నోడల్‌ అధికారులందరినీ జాయింట్‌ కలెక్టర్‌, జిల్లా రెవెన్యూ అధికారి పర్యవేక్షిస్తారని, ఎన్నికల సంబంధిత కార్యకలాపాల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూసు కోవాలన్నారు. ఎన్నికల విధులలో నిర్లక్ష్యం వహించడం, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే చాలా తీవ్రంగా పరిగణించబడుతుందని, అమలులో ఉన్న ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోబడుతుందన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ యం. నగేష్, ఆర్డీవో పద్మావతి, అందరు నోడల్ అధికారులు పాల్గొన్నారు. (Story: పార్లమెంట్ ఎన్నికలపై వ‌న‌ప‌ర్తి క‌లెక్ట‌ర్ ఆదేశాలు)

See Also:

బీజేపీ దారెటు?

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1