గెలుపు నాదే: చిన్నం రామకోటయ్య
శ్రీనివాస్ (న్యూస్ తెలుగు-చాట్రాయి) :
నూజివీడు శాసనసభా స్థానానికి జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచేది తానేనని మాజీ శాసనసభ్యులు స్వతంత్ర అభ్యర్థి చిన్నం రామకోటయ్య విశ్వాసం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన న్యూస్ తెలుగుతో మాట్లాడుతూ. నియోజకవర్గంలోని వైసిపి, తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని ప్రజలను ప్రజా సమస్యలను వారు పట్టించుకోవడం లేదన్నారు. తనకు 90వేల నుంచి లక్ష ఓట్ల వరకు వస్తాయన్నారు. తానే కచ్చితంగా స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచి తీరుతానన్నారు. చాట్రాయి మండలంలో 27,500 పైగా తనకు ఓట్లు వస్తాయన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను గుర్తించి వాటిని పరిష్కరించడమే తన లక్ష్యమన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి రాష్ట్రస్థాయిలో నూజివీడుకి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకువచ్చేలా పని చేస్తానన్నారు. ఎక్కడకు వెళ్లినా ప్రజలు తనకు బ్రహ్మరథం పడుతున్నారని, చాలా ఆనందదాయకంగా ఉందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన సేవలను ప్రజలు ఇంకా మరిచిపోలేదని తెలిపారు. (Story: గెలుపు నాదే: చిన్నం రామకోటయ్య)
See Also:
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!