మందకొడిగా రహదారి నిర్మాణం
పాలకోడేరు (న్యూస్ తెలుగు): ఏలూరు జిల్లా పాలకోడేరు మండలం లోని వేండ్ర గ్రామం సీసీ రోడ్డు నిర్మాణం నత్తనడకన సాగుతోంది. వేండ్ర డెల్టా పేపర్ మిల్లు నుండి వేండ్ర గ్రామంలో సిసి రోడ్డు మినహాయించి వేండ్ర శివారు మద్యం దుకాణం వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర తారు రోడ్డు వేయుటకు రూ.2.15 లక్షలు కేటాయించి పనులు మొదలు పెట్టి చాలా రోజులు అయినప్పటికీ రోడ్డు పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో రోడ్డు మీద వాహనాలు తిరుగుతుంటే విపరీతమైన దుమ్ము రెగుతుండటంతో వాహనదారులు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై అర్ & బి డిఇ రామరాజుని ఫోన్ లో సంప్రదించగా నిధుల విడుదలలో జాప్యం కారణంగా రహదారి నిర్మాణం ఆలస్యం అవుతున్నట్టు తెలిపారు. వేండ్ర శివారు నుండి కొండేపూడి గ్రామం శివారు వరకు అధ్వాన్నం గా ఉన్న రోడ్డు కు మరమ్మతులు చేపడుతున్నట్టు తెలిపారు. (Story: మందకొడిగా రహదారి నిర్మాణం)
See Also:
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!