ముద్దరబోయిన పేరెత్తని చంద్రబాబు..?
శ్రీనివాస్-చాట్రాయి (న్యూస్ తెలుగు) : ‘నేను మీ చంద్రబాబు నాయుడు.. మీ నియోజకవర్గంలో.. అభ్యర్థిగా పోటీ చేయడానికి ఎవరు పనికి వస్తారు..? కొలుసు పార్థసారథి అయితే ఒకటి నొక్కండి.. నోటా అయితే రెండు నొక్కండి అంటూ సర్వేలో చంద్రబాబు గొంతుతోనే కార్యకర్తలకు ఫోన్లు రావడం, ముద్దరబోయిన పేరు ఎత్తకపోవడం చర్చనీయాంశం అయింది. నూజివీడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపరంగా పార్టీ నిర్మాణానికి పూర్తిస్థాయిలో తిలోదకాలు ఇచ్చి ముఠా తగాదాలు తారస్థాయికి చేరుకున్న సందర్భంలో చంద్రబాబును కలిసి వచ్చిన తర్వాత అభ్యర్థి మార్పుపై గడచిన పదేళ్లుగా తెలుగుదేశం పార్టీ నూజివీడు నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఆత్మీయ సభలో కంట తడి పెట్టుకోవడం.. ఐవిఆర్ఎస్ సర్వేలో చంద్రబాబు గొంతుతో .. పార్టీ కోసం పదేళ్ళు పనిచేసిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పేరు సైతం లేకుండా ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పేరు ఒక్కటి మాత్రమే అడగటం చర్చనీయాంశంగా మారింది. గడచిన పదేళ్లు పొయ్యి కాడ మసిగుడ్డ మాదిరిగా ముద్దరబోయిన వెంకటేశ్వరరావుని వాడుకున్నారని పలువురు అంటున్నారు. నియోజకవర్గ ఇన్చార్జిగా వున్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావుతో కనీస సంప్రదింపులు జరపకుండా ప్రత్యర్థి పార్టీలో పని చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేకు టిక్కెట్ కేటాయించడం చంద్రబాబు గొంతు ముద్దరబోయిన పేరు ఎత్తకపోవడం చర్చనీయాంశం అయింది. ముద్దరబోయిన ఒంటెత్తు పోకడలు పోతున్నారని పార్టీలో ఒక వర్గం పదేళ్లుగా ఎన్ని ఫిర్యాదు లు చేసినా పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు మాత్రం చెప్పా పెట్టకుండా అభ్యర్థిని మార్చడం వివాదాస్పదమయింది. (Story: ముద్దరబోయిన పేరెత్తని చంద్రబాబు..?)
See Also:
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!