Home టాప్‌స్టోరీ అమెరికా ప్రెసిడెంట్‌ రేసులో మరో ఇండో అమెరికన్‌!

అమెరికా ప్రెసిడెంట్‌ రేసులో మరో ఇండో అమెరికన్‌!

0
Indian American Hirsh Vardhan Singh
Indian American Hirsh Vardhan Singh

అమెరికా ప్రెసిడెంట్‌ రేసులో మరో ఇండో అమెరికన్‌!

వాషింగ్టన్‌: పాపం డోనాల్డ్‌ ట్రంప్‌ స్టెరాయిడ్‌ సమస్యల్లో వున్నారేమో…రిపబ్లికన్లలో అధ్యక్ష పదవికి పోటీ పెరుగుతోంది. కొత్త అభ్యర్థులు తెరపైకి వస్తున్నారు. తాజాగా మరో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి అధ్యక్ష రేసులో ఉన్నట్లు ప్రకటించారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడటానికి భారతీయ సంతతికి చెందిన (ఇండో అమెరికన్‌) హర్ష్‌వర్ధన్‌ సింగ్‌ సిద్ధమయ్యాడు. ఇప్పటికే రిపబ్లికన్లలో చాలామంది అధ్యక్ష పోటీలు వున్నట్లు ప్రకటించుకున్నారు.తాజాగా హర్ష్‌వర్ధన్‌ సింగ్‌ కూడా రింగులోకి టోపీ విసరడంతో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. విచిత్రమేమిటంటే, ఇప్పటికే ఇద్దరు ఇండో అమెరికన్లు ఈ రేసులో వున్నారు. హర్ష్‌వర్ధన్‌ సింగ్‌ మూడవ వ్యక్తి. కొన్ని రోజుల క్రితం రిపబ్లికన్‌ నామినేషన్‌ కోసం సౌత్‌ కరోలినా మాజీ గవర్నర్‌ నిక్కీ హేలీతోపాటు ప్రముఖ పారిశ్రామికవేత్త వివేక్‌ రామస్వామి తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. హర్ష్‌వర్ధన్‌ సింగ్‌ సోషల్‌మీడియా వేదిక ‘ఎక్స్‌’ (గతంలో ట్విటర్‌)లో ఒక వీడియో పోస్ట్‌ చేశారు. తాను లైఫ్‌లాంగ్‌ రిపబ్లికన్‌ను అంటూ ప్రకటించుకున్నారు. పైగా కన్జర్వేటివ్స్‌లో ‘అమెరికన్‌ ఫస్ట్‌’గా రాసుకున్నారు. అంటే అధ్యక్ష పదవికి పోటీలో వున్నట్లే లెఖ్క. న్యూ జెర్సీ రిపబ్లికన్‌ పార్టీలోని ఒక కన్జర్వేటివ్‌ వింగ్‌లో ఆయన క్రియాశీలంగా పనిచేస్తున్నారు. అతిపెద్ద ఐటీ కంపెనీలు, మందుల కంపెనీల అవినీతిని ఎండగట్టారు. మన స్వేచ్ఛను కాపాడుకోవడానికి తాను నిరంతరం పోరాడుతూనే వుంటానని చెప్పుకున్నారు. అమెరికా కుటుంబ విలువలు, తల్లిదండ్రులు హక్కులు, సరికొత్త ఆలోచనల మార్కెట్‌ ప్లేస్‌పై సుదీర్ఘంగా చర్చించారు. స్వచ్ఛమైన రక్తంగల రిపబ్లికన్‌గా తనను తాను ప్రకటించుకున్నారు. కాలేజీ రోజుల నుంచి ఆయన చేసిన పోరాటాలను ‘ఎక్స్‌’లో వివరించారు. యంగ్‌ అమెరికన్‌ ఫర్‌ లిబర్టీలో చేరిన తర్వాత, యూనివర్శిటీ రోజుల్లో చేసిన ఉద్యమాలను వెల్లడిరచారు. డోనాల్డ్‌ ట్రంప్‌కు వీరాభిమానిగా ప్రకటించుకున్నారు. అమెరికా చరిత్రలోనే డోనాల్డ్‌ ట్రంప్‌ గొప్ప అధ్యక్షునిగా అభివర్ణించారు. అమెరికన్లకు రిపబ్లికన్ల అవసరం అత్యంత అవశ్యమని తెలిపారు. అమెరికా అధ్యక్షునిగా తన గెలుపు ఖాయమని అర్థం వచ్చేలా ఆయన పదజాలాన్ని ఉపయోగించారు. (Story: అమెరికా ప్రెసిడెంట్‌ రేసులో మరో ఇండో అమెరికన్‌!)

See Also

Bro Success Celebrations

హంతకుడుగా ముద్రపడిన కెప్టెన్ మిల్లర్‌!

క‌న్నీళ్లు ఆర‌క‌ముందే… మ‌ళ్లీ వ‌ర‌ద‌!

హీరో నితిన్‌కు ఎక్స్‌ట్రాలు ఎక్కువే!

షూటింగ్‌లో ఉప‌వాసం చేసిన ప‌వ‌ర్‌స్టార్‌!

మెగాస్టార్ ‘భోళా శంకర్’ ‘మిల్కీ బ్యూటీ’ పాట వ‌చ్చేసింది!

ఆ చేప కన్పిస్తే…సునామీనే!

చికెన్‌ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం

వివేకా హ‌త్య కేసులో ఆ నివేదిక‌లే కీల‌కం!

షాకింగ్‌ న్యూస్‌: హీరో అబ్బాస్‌ ఇప్పుడు కారు డ్రైవరా?

ప్రేమలో సంతోషం, బాధ అన్నీ..!

బిగ్‌బాస్ సొహైల్‌కు క‌డుపొచ్చింది!

‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్

స‌రికొత్త లుక్‌లో వ‌రుణ్ తేజ్

https://www.youtube.com/@abtimes106

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version