Homeటాప్‌స్టోరీప్రతినిధి 2 మైండ్ బ్లోయింగ్ ఫస్ట్ లుక్!

ప్రతినిధి 2 మైండ్ బ్లోయింగ్ ఫస్ట్ లుక్!

ప్రతినిధి 2 మైండ్ బ్లోయింగ్ ఫస్ట్ లుక్!

నారా రోహిత్, మూర్తి దేవగుప్తపు, వానర ఎంటర్‌టైన్‌మెంట్స్ #NaraRohit19 టైటిల్ ప్రతినిధి 2, మైండ్ బ్లోయింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల, జనవరి 25, 2024న థియేట్రికల్ రిలీజ్

హీరో నారా రోహిత్ కమ్ బ్యాక్ మూవీ కొన్ని రోజుల క్రితం ఆసక్తిని రేకెత్తించే ప్రీ లుక్ పోస్టర్‌తో అనౌన్స్ చేశారు. ఈరోజు ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. వానర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి ప్రతినిధి 2 అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. దీంతో ఇది ప్రతినిధి సిరీస్ నుండి రెండవ ఫ్రాంచైజీ కానుంది.

పొలిటికల్ థ్రిల్లర్ ప్రతినిధి సంచలన విజయం సాధించింది.  యూనిక్ కథ, గ్రిప్పింగ్ కథనంతో అందరి ప్రశంసలు అందుకుంది. ప్రతినిధి 2 కోసం మరింత బిగ్ స్పాన్ వున్న కథను ఎంచుకున్నారు.  “One man will stand again, against all odds,” అనేది సినిమా క్యాప్షన్.

ఫస్ట్-లుక్ పోస్టర్ మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్, ప్రెజెంటేషన్ తో అందరినీ ఆకట్టుకుంది. నారా రోహిత్ చేయి పైకెత్తి కనిపిస్తున్నారు. అతని జుట్టు నుంచి ముఖం వరకు, ప్రతిదీ వార్తాపత్రికలతో డిజైన్ చేయబడింది.  ఫస్ట్ లుక్ సూచించినట్లుగా, ప్రతినిధి 2 సోషల్ ఇష్యూస్ ని డీల్ చేయనుంది. ఫస్ట్ లుక్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచింది.

కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. యువ సంచలనం మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా, నాని చమిడిశెట్టి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.

పోస్టర్‌లో చూపిన విధంగా ఈ చిత్రం 2024 జనవరి 25న రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రంలో హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని మేకర్స్ తెలియజేశారు.

తారాగణం: నారా రోహిత్

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: మూర్తి దేవగుప్తపు
నిర్మాతలు: కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి
ప్రొడక్షన్ బ్యానర్: వానర ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: మహతి స్వర సాగర్
ఎడిటర్: రవితేజ గిరిజాల
డీవోపీ: నాని చమిడిశెట్టి
ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె
స్టంట్స్: శివరాజు
పబ్లిసిటీ డిజైన్స్ : అనిల్ & భాను
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్: ప్రవీణ్ & హౌస్‌ఫుల్ డిజిటల్ (Story: ప్రతినిధి 2 మైండ్ బ్లోయింగ్ ఫస్ట్ లుక్!)

News on YouTube

మెగాస్టార్ ‘భోళా శంకర్’ ‘మిల్కీ బ్యూటీ’ పాట వ‌చ్చేసింది!

ఆ చేప కన్పిస్తే…సునామీనే!

చికెన్‌ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం

వివేకా హ‌త్య కేసులో ఆ నివేదిక‌లే కీల‌కం!

షాకింగ్‌ న్యూస్‌: హీరో అబ్బాస్‌ ఇప్పుడు కారు డ్రైవరా?

ప్రేమలో సంతోషం, బాధ అన్నీ..!

బిగ్‌బాస్ సొహైల్‌కు క‌డుపొచ్చింది!

‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్

స‌రికొత్త లుక్‌లో వ‌రుణ్ తేజ్

https://www.youtube.com/@abtimes106

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!