Home వార్తలు తిరుపతిలో టాటా బిగ్‌బాస్కెట్‌

తిరుపతిలో టాటా బిగ్‌బాస్కెట్‌

0
Big Basket
Big Basket

తిరుపతిలో టాటా బిగ్‌బాస్కెట్‌

తిరుపతి : టాటా ఎంటర్‌ప్రైజ్‌ , బిగ్‌బాస్కెట్‌  ఇప్పుడు తిరుపతిలో తమ కార్యకలాపాలను ప్రారంభించింది. భూమన అభినయ్‌ రెడ్డి (డిప్యూటీ మేయర్‌, తిరుపతి)భారతదేశపు అతిపెద్ద ఆన్‌లైన్‌ సూపర్‌మార్కెట్‌ను స్వాగతించడంతో పాటుగా తిరుపతి లో మొట్టమొదటి ఆర్డన్‌ను చేశారు. ప్రస్తుతం భారతదేశంలో అన్ని ప్రధాన నగరాల్లోనూ కార్యకలాపాలు నిర్వహిస్తోన్న బిగ్‌బాస్కెట్‌, తిరుపతిలో కార్యకలాపాలు ప్రారంభించడం ద్వారా  భారతదేశంలో 200 మిలియన్‌ల ఇంటర్నెట్‌ వినియోగదారులకు అతి తక్కువ ధరలకు కిరాణా సరుకులను అందించాలనే తమ లక్ష్యానికి మరో అడుగు చేరువయింది.
వినియోగదారులు ఇప్పడు బియ్యం,  పప్పులు, మసాలాలు, పర్సనల్‌ కేర్‌, బ్రాండెడ్‌ ఫుడ్‌, కిచెన్‌, గృహోపకరణాలు సహా విస్తృత శ్రేణి ఉత్పత్తులను కనీసం 6% తగ్గింపుతో యాప్‌ ద్వారా ఆర్డర్‌ చేయవచ్చు.
ఈ ప్రారంభం గురించి శ్రీ హర్ష జెట్టి, బిజినెస్‌ హెడ్‌, బిగ్‌బాస్కెట్‌ మాట్లాడుతూ ‘‘టాటా వ్యాపార విభాగం బిగ్‌బాస్కెట్‌ కుటుంబంలో భాగం కావాల్సిందిగా తిరుపతిలోని వినియోగదారులందరినీ స్వాగతిస్తున్నాము. భారతీయ వినియోగదారుల కిరాణా అవసరాలను మేము పూర్తిగా అర్థం చేసుకున్నాము మరియు ప్రపంచ ప్రసిద్ధి చెందిన నగరంలో మా సేవలను ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉన్నాము.  ప్రతి రోజూ అతి తక్కువ ధరలకు అత్యున్నత నాణ్యత కలిగిన ఉత్పత్తులను అందించాలన్నది మా లక్ష్యం. త్వరలోనే తిరుపతి వాసులకు నమ్మకమైన గ్రోసరీ భాగస్వామిగా నిలువగలమని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.
ఆయనే మాట్లాడుతూ ‘‘ మేము అందించే ఉత్పత్తులు అత్యున్నత నాణ్యత కలిగి ఉంటాయి మరియు వాటిని అత్యంత అందుబాటు ధరలో అందించడానికి ప్రయత్నిస్తున్నాము. అన్ని విభాగాల్లోనూ 20వేలకు పైగా ఉత్పత్తులను అందించడంతో పాటుగా కనీసం  6% రాయితీని అన్ని ఎస్‌కెయులపై అందిస్తున్నాము.  సౌకర్యవంతమైన షాపింగ్‌ అనుభవాలను అందించడాన్ని బిగ్‌బాస్కెట్‌ లక్ష్యంగా చేసుకుంది.  ప్రతి రోజూ తక్కువ ధరలు. (Story: తిరుపతిలో టాటా బిగ్‌బాస్కెట్‌)

See Also: మళ్లీ పెరిగిన ఆర్‌టిసి ఛార్జీలు

 చైనాలో లాక్‌డౌన్‌!

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)

మందుబాబులకు హ్యాపీ న్యూస్‌..!

తొలిరోజే ఆర్‌ఆర్‌ఆర్‌ కలెక్షన్ల తుఫాన్‌!

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అసలు రివ్యూ ఇదే!

మెగాస్టార్ మేడే!

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version