UA-35385725-1 UA-35385725-1

చేతులెత్తేసిన ముంబయి ఇండియన్స్‌!

చేతులెత్తేసిన ముంబయి ఇండియన్స్‌!

ఐపీఎల్‌లో శుభారంభం పలికిన ఢిల్లీ క్యాపిటల్స్‌

ముంబయి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో ముంబయి ఇండియన్స్‌ తన సాంప్రదాయాన్ని కొనసాగించింది. ఎప్పటిలాగానే తొలి మ్యాచ్‌లో పరాజయం పాలైంది. వాంఖడే స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రెండవ లీగ్‌ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ (డిడి) 4 వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్‌పై అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేయగా, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇంకా 1.4 ఓవర్లు మిగిలివుండగానే 6 వికెట్లు మాత్రమే కోల్పోయి 179 పరుగులు చేసి తొలి విజయం నమోదు చేసింది. అద్భుతమైన బౌలింగ్‌తో క్యాపిటల్స్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన కుల్‌దీప్‌ యాదవ్‌ మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు గెల్చుకున్నాడు. క్యాపిటల్స్‌ ఈ మ్యాచ్‌లో తడబడి చివరకు నిలబడిరది. ఓడిపోవాల్సిన మ్యాచ్‌లో గెలిచితీరింది.
178 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆరంభం అదరగొట్టింది. ఓపెనర్లు పృథ్వీషా, టిమ్‌ సీఫెర్ట్‌లు చకచకా 30 పరుగులు చేశారు. అయితే టిమ్‌ఫెర్ట్‌ నాలుగు బౌండరీలు కొట్టిన తర్వాత అశ్విన్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత మణ్‌దీప్‌సింగ్‌ (0), రిషబ్‌ పంత్‌ (1)లు అనూహ్యంగా వెనుదిరిగారు. మణ్‌దీప్‌ను అశ్విన్‌, పంత్‌ను మిల్స్‌ వెనక్కి పంపించారు. 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన క్యాపిటల్స్‌ను పృథ్వీషా, లలిత్‌ యాదవ్‌లు లాక్కొచ్చారు. ఇరువురూ నాల్గవ వికెట్టుకు అత్యంత అమూల్యమైన 40 పరుగుల భాగస్వామ్యాన్ని జోడిరచారు. ఈ తరుణంలో బాసిల్‌ థంపీ బౌలింగ్‌లో ఇషాన్‌ కిషన్‌ పట్టిన క్యాచ్‌కు పృథ్వీషా (38) అవుటయ్యాడు. అతను 4 ఫోర్లు, 2 సిక్సర్లతో రాణించాడు. మరో 2 బంతుల వ్యవధిలో పావెల్‌ (0) కూడా థంపీ బౌలింగ్‌లో శామ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ దారిపట్టాడు. ఈ తరుణంలో లలిత్‌ యాదవ్‌, శార్దూల్‌ ఠాకూర్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వారు ఆరో వికెట్టుకు 32 పరుగులు జోడిరచిన తర్వాత శార్దూల్‌ ఓపిక నశించింది. 4 ఫోర్లతో 11 బంతుల్లో 22 పరుగుల స్పీడ్‌ స్కోరు చేసిన అతను థంపీ బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఈ దశలో దిగిన అక్షర్‌ పటేల్‌ వీరవిహారం చేశాడు. అతను ఏకంగా 17 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 భారీ సిక్సర్ల సాయంతో 38 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతోపాటు మ్యాచ్‌ ఫలితాన్ని మార్చేశాడు. లలిత్‌ యాదవ్‌ 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 48 పరుగుల అజేయ స్కోరుతో నిలిచాడు. ముంబయి ఇండియన్స్‌ బౌలర్లలో బుమ్రా, శామ్స్‌లు ఘోరంగా విఫలమయ్యారు. థంపీ మూడు వికెట్లు, మురుగన్‌ అశ్విన్‌ 2, మిల్స్‌ ఒక వికెట్టు తీసుకున్నారు.
అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ టాస్‌ గెలిచి ముందుగా ముంబయిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు రోహిత్‌శర్మ, ఇషాన్‌ కిషన్‌లు అద్భుతమైన బ్యాటింగ్‌తో క్యాపిటల్స్‌కు చుక్కలు చూపించారు. వీరు 67 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యం అందించిన తర్వాత కుల్‌దీప్‌ యాదవ్‌ వేసిన అద్భుతమైన బంతికి పావెల్‌ పట్టిన క్యాచ్‌తో రోహిత్‌ అనూహ్యంగా అవుటయ్యాడు. రోహిత్‌ 32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు చేశాడు. అక్కడే మ్యాచ్‌ దాదాపు టర్న్‌ అయింది. ఇషాన్‌ కిషన్‌ అద్భుతంగా ఆడుతున్నప్పటికీ, ఆ తర్వాత వచ్చిన అన్‌మోల్‌ప్రీత్‌ (8), తిలక్‌ వర్మ (22), పోలార్డ్‌ (3), టిమ్‌ డేవిడ్‌ (12)లు పెద్దగా ఆడలేదు. తిలక్‌ వర్మ 3 ఫోర్లతో కాస్త మెరుపులు మెరిపించాడు. ఈ ఐపీఎల్‌లో అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న ఇషాన్‌ మాత్రం 48 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 81 పరుగులు చేసి అజేయంగా నిలిచి తాను తీసుకుంటున్న డబ్బులకు న్యాయం చేశాడు. క్యాపిటల్స్‌ బౌలర్లలో కుల్‌దీప్‌ యాదవ్‌ 3 వికెట్లు, ఖలీల్‌ అహ్మద్‌ 2 వికెట్లు తీసుకున్నారు. (Story: చేతులెత్తేసిన ముంబయి ఇండియన్స్‌!)

See Also: మన సింధు స్విస్‌ ఓపెన్‌ గెలిచింది!

See Also: నిరుద్యోగులకు తీపికబురు!

ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)

మందుబాబులకు హ్యాపీ న్యూస్‌..!

తొలిరోజే ఆర్‌ఆర్‌ఆర్‌ కలెక్షన్ల తుఫాన్‌!

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అసలు రివ్యూ ఇదే!

మెగాస్టార్ మేడే!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1