మందుబాబులకు హ్యాపీ న్యూస్..!
బీర్లు, మందు ధరలు తగ్గనున్నాయ్
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుంచే అమలు?
హైదరాబాద్: తెలంగాణలో మద్యం ప్రియులకు కే.చంద్రశేఖర్‌రావు ప్రభుత్వం ఒక హ్యాపీన్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. ఇంతకీ కేసీఆర్ ప్రభుత్వం మందుబాబులకు చెప్పే శుభవార్త ఏమిటో తెలుసా? తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే లిక్కర్ ధరలు తగ్గనున్నాయి. ముఖ్యంగా బీర్ల ధరలను తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. ఈ మేరకు మద్యం ధరల తగ్గింపునకు సంబంధించిన ప్రతిపాదనల ఫైలు సీఎం టేబుల్‌పై సంతకానికి వేచిచూస్తున్నది. విస్కీ, బ్రాందీ, రమ్ము కన్నా బీర్ల ధరలు తగ్గించి.. రాష్ట్రంలో మద్యం అమ్మకాలను మరింతగా పెంచే దిశగా అబ్కారీ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం అందుతోంది. సహజంగానే వేసవికాలంలో మందుబాబులు ఎక్కువగా బీర్లుపై ఆసక్తి చూపుతారు. ఈ సమయంలో బీర్ల రేట్లు బాగా తగ్గిస్తే ఎలా వుంటుందని అబ్కారీ శాఖలోని ఉన్నతాధికారి ఒకరు ప్రతిపాదన చేశారట! ఈ ఆలోచనేదో బాగానే వుందని భావించిన ప్రభుత్వం ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరింది. అయితే ఒక్క బీర్ల రేట్లే తగ్గించడం వల్ల ఉపయోగం లేనందున, దీంతోపాటు ఇతర లిక్కర్ వేరియంట్లనూ కొంతమేరకు తగ్గిస్తే మంచి ఫలితాలు వుంటాయని భావించి, ఫైల్ రెడీ చేసింది. ఒక్క బీరుపై రూ.20 తగ్గిస్తే అమ్మకాలు విపరీతంగా పెరుగుతాయని ప్రభుత్వం యోచిస్తున్నది.అటు లిక్కర్ ఒక్కో బాటిల్‌పై పది రూపాయలు తగ్గించేందుకు అధికారులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ప్రభుత్వ అధికారిక ప్రకటన చేయనుంది. కేసీఆర్ ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తే కొత్త రేట్లు వచ్చే నెల నుంచి అంటే ఏప్రిల్ 1 తేదీ నుంచే అమలులోకి వచ్చే అవకాశం వుంది. (Story: మందుబాబులకు హ్యాపీ న్యూస్..!)
See Also: ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)
తొలిరోజే ఆర్‌ఆర్‌ఆర్ కలెక్షన్ల తుఫాన్!