Home కెరీర్‌ ఉద్యోగ నియామక పరీక్షల సిలబస్‌ మారనుందా?

ఉద్యోగ నియామక పరీక్షల సిలబస్‌ మారనుందా?

0
Telangana Jobs

ఉద్యోగ నియామక పరీక్షల సిలబస్‌ మారనుందా?

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో చేపట్టనున్న ఉద్యోగ నియామకాల పరీక్షలకు సంబంధించిన సిలబస్‌ మారనున్నట్లు పత్రికల్లో వచ్చిన వార్తలు ఒక్కసారిగా నిరుద్యోగులను ఉలికిపాటుకు గురిచేసింది. సిలబస్‌ (పాఠ్యప్రణాళిక)లో కొన్నిమార్పులు చేర్పులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సిలబస్‌ చేర్పులమార్పులపై ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ సారథ్యంలో ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 15 రోజుల్లో ఈ కమిటీ సిలబస్‌ను రూపొందిస్తుంది. ప్రభుత్వం ఆమోదిస్తే, వెంటనే దాన్ని టీఎస్‌పీఎస్సీతో పాటు ఇతర నియామక సంస్థలకు అందజేస్తారు. దీని ఆధారంగా నియామక సంస్థలు సిలబస్‌ను ప్రకటిస్తాయి. పరీక్షల నిర్వహణ అనంతరం వాల్యూయేషన్‌లోనూ వీరికి అవకాశం కల్పించే అవకాశం వుందని అంటున్నారు. తెలంగాణ చరిత్ర, ఉద్యమ ప్రస్థానం, రాష్ట్ర ఆవిర్భావ పరిణామాలు తదితర అంశాలతో పాటు కొత్త రాష్ట్రమయ్యాక ఇప్పటి వరకు సాధించిన అభివృద్ధి, చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు, ప్రాజెక్టులు, జాతీయస్థాయిలో సాధించిన విజయాలు, పరిపాలన విభాగాలు, పారిశ్రామిక ప్రగతి, కొత్త జోనల్‌ విధానం వంటి అంశాలను సిలబస్‌లో చేర్చాలని సర్కారు భావిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2016లో ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీ, పోలీసు నియామక, ఇతర సంస్థల ద్వారా నిర్వహించిన పరీక్షలకు 18 మంది నిపుణులతో కూడిన కమిటీని నియమించింది. ఆ కమిటీ సిలబస్‌ను రూపొందించి ఆయా నియామక సంస్థలకు అందజేసింది. అదే విధానాన్ని తాజాగా పాటించాలని సర్కారు సంకల్పించింది. ఉద్యోగ నియామకాల కోసం రాత పరీక్షలు తప్పనిసరి. కొన్నింటికి రాత, మౌఖిక పరీక్షలూ ఉంటాయి. గ్రూపు-1 లాంటి వాటికి ప్రాథమిక, ప్రధాన, మౌఖిక పరీక్షలుంటాయి. వీటికి అవసరమైన సిలబస్‌ సంగ్రహ రూపాన్ని నోటిఫికేషన్లకు ముందే వెల్లడిస్తారు. తెలంగాణలో కొత్త నియామకాలు తొలిసారిగా 95 శాతం స్థానికులకు రిజర్వేషన్‌ ప్రాతిపదికన జరుగుతున్నాయి. పోటీ పరీక్షల సిలబస్‌లో వర్తమాన అంశాలు (కరెంట్‌ అఫైర్స్‌), సాధారణ పరిజ్ఞానం (జనరల్‌ నాలెడ్జి), జనరల్‌ సైన్స్‌, పర్యావరణ, ఆర్థిక, సామాజిక అంశాలు, భౌగోళిక స్వరూపం, చరిత్ర, సంస్కృతి, రాజ్యాంగం, పాలన, ప్రభుత్వ విధానాలు వంటివి ప్రధానంగా ఉంటాయి. (Story: ఉద్యోగ నియామక పరీక్షల సిలబస్‌ మారనుందా?)

See Also: టెట్‌ పరీక్షల సిలబస్‌ ఇదే!

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అసలు రివ్యూ ఇదే!

మెగాస్టార్ మేడే!

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version