చెన్నై సూపర్‌కింగ్స్‌కు షాక్
ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా విజయభేరి
ముంబయి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 టోర్నీ తొలిరోజే ఆసక్తికరమైన ఫలితం వెలువడిరది. శనివారంనాడు ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై అద్భుతమైన విజయం సాధించింది. చెన్నై అనూహ్య పరాజయాన్ని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేయగా, కోల్‌కతా ఇంకా 1.3 ఓవర్లు మిగిలివుండగానే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 133 పరుగులు చేసి శుభారంభం పలికింది. ఇద్దరు కొత్త కెప్టెన్ల మధ్య జరిగిన తొలి పోరులో శ్రేయాస్ అయ్యర్ విజయం సాధించాడు. జడేజా యావ్‌రేజ్ అన్పించాడు. డ్వేన్ బ్రేవో అద్భుతమైన బౌలింగ్ చేసినప్పటికీ, కోల్‌కతాను కట్టడి చేయలేకపోయారు. శ్రేయాస్ టీమ్ అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ రాణించి తన సత్తా చాటిచెప్పింది. ఈ విజయంపై ఫ్రాంఛైజీ యజమాని షారూఖ్ ఖాన్ హర్షం ప్రకటించాడు. అజింక్య రహానే ఓపెనర్‌గా అదరగొట్టి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
132 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆరంభం నుంచీ ఆచితూచి ఆడిరది. అజింక్య రహానే మాత్రం దూకుడుగా ఆడి తన టెస్టు ప్లేయింగ్ ముద్రను చెరిపేసుకున్నాడు. అతను కేవలం 34 బంతుల్లోనే 6 చూడముచ్చటైన ఫోర్లు, ఒక భారీ సిక్సర్ సాయంతో 44 పరుగులు చేశాడు. జట్టుస్కోరు 43 పరుగుల వద్ద వెంకటేష్ అయ్యర్ (16) బ్రేవో బౌలింగ్‌లో ధోనీ పట్టిన క్యాచ్‌కు అవుటయ్యాడు. ఆ తర్వాత రహానే, నితీష్ రాణాలు కాసేపు క్రీజ్‌లో నిలబడ్డారు. 10వ ఓవర్‌లో బ్రేవో బౌలింగ్‌లోనే రాయుడు పట్టిన క్యాచ్‌కు రాణా (21) నిష్క్రమించాడు. కెప్టెన్ శ్రేయాస్ దిగి కోల్‌కతాకు మంచి ధైర్యాన్ని ఇచ్చాడు. కాకపోతే రహానే కొద్దిసేపటికే శాంట్నర్ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చాడు. ఈ దశలో శ్రేయాస్, శామ్ బిల్లింగ్స్‌లు వికెట్ల పతనాన్ని ఆపగలిగారు. ఇద్దరూ స్కోరు బోర్డును నెమ్మదిగా కదిలిస్తూ నాల్గవ వికెట్టుకు 36 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యాన్ని అందించారు. బిల్లింగ్స్ 22 బంతుల్లో 25 పరుగులు చేసి (ఒక ఫోర్, ఒక సిక్సర్) బ్రేవో బౌలింగ్‌లో తుషార్ దేశ్‌పాండేకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. చివర్లో శ్రేయాస్, షెల్డన్ జాక్సన్‌లు విజయాన్ని పరిపూర్ణం చేశారు. చెన్నై బౌలర్లలో బ్రేవో మూడు వికెట్లు, శాంట్నర్ ఒక వికెట్టు తీసుకున్నారు.
అంతకుముందు, టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలింగ్ ఎంచుకొని, ప్రత్యర్థి చెన్నై సూపర్‌కింగ్స్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కేకేఆర్ ఆశించినట్లుగానే తొలి ఓవర్‌లోనే సీఎస్‌కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (0) వికెట్టును కోల్పోయింది. ఉమేష్ యాదవ్ సంధించిన అద్భుతమైన బంతిని టిప్ చేయబోయిన రుతురాజ్ నితీష్‌రాణాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ ముఖంపట్టాడు. ఆ తర్వాత డెవాన్ కాన్‌వే, రాబిన్ ఉతప్పలు ఇన్నింగ్స్‌ను లాగే ప్రయత్నం చేశారు. కానీ 5వ ఓవర్‌లో ఉమేష్ యాదవ్ మరో బ్రేక్‌త్రూ సాధించాడు. అతని బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్ పట్టిన క్యాచ్‌కు కాన్‌వే (3) అవుటయ్యాడు. రాబిన్ ఉతప్ప(28) రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో దూకుడుగా ఉన్నట్లు అన్పించినా, జట్టు స్కోరు అర్థసెంచరీ దాటకముందే 8వ ఓవర్‌లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో షెల్డాన్ జాక్సన్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. అంబటి రాయుడుపై చెన్నై ఎన్ని ఆశలు పెట్టుకున్నా అతను రనౌట్‌గా అవుట్ కావాల్సి వచ్చింది. సింగిల్ రన్ కోసం చేసిన ప్రయత్నంలో సునీల్ నరైన్ విసిరిన బంతిని శ్రేయాస్ అయ్యర్ సకాలంలో స్పందించి, వికెట్లను బంతితో తాకించడంతో రాయుడు (15) వెనుదిరిగాడు. కొద్దిసేపటికే శివమ్ దూబే (3)ను ఆండ్రీ రస్సెల్ వెనక్కి పంపించాడు. 61 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్రమైన కష్టాల్లో కూరుకుపోయిన చెన్నైని మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, కెప్టెన్ రవీంద్ర జడేజాలు నెమ్మదిగా ముందుకు నడిపించారు. ఇంకో వికెట్టును చేజార్చుకోకుండా వుండటానికి ప్రథమ ప్రాధాన్యతనిచ్చారు. అయితే ధోనీ మాత్రం దూకుడుగా ఆడాడు. ధోనీ కేవలం 38 బంతుల్లోనే 7 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 50 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆఖరి బంతిని సిక్సర్‌గా మార్చిన ధోనీ చాన్నాళ్ల తర్వాత అద్భుతంగా రాణించాడు. జడేజా ఒక సిక్సర్ సాయంతో 26 పరుగులు చేసి అజేయంగా నిలిచి, స్కోరును 131 పరుగుల వద్ద ముగించారు. కోల్‌కతా బౌలర్లలో ఉమేష్ రెండు వికెట్లు, రసెల్, చక్రవర్తిలు తలో వికెట్టు తీసుకున్నారు. (Story: చెన్నై సూపర్‌కింగ్స్‌కు షాక్)
See Also: తొలిరోజే ఆర్‌ఆర్‌ఆర్ కలెక్షన్ల తుఫాన్!
See Also: ఆర్‌ఆర్‌ఆర్ మూవీ అసలు రివ్యూ ఇదే!