Homeవార్తలుమంచి ఆదరణ అంటే ఇదేనేమో

మంచి ఆదరణ అంటే ఇదేనేమో

మంచి ఆదరణ అంటే ఇదేనేమో

నా మొదటి సినిమాకే ఇంత ఆదరణ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ..”నల్లమల” సక్సెస్ మీట్ లో దర్శకుడు రవి చరణ్ 

మంచి ఆదరణ అంటే ఇదేనేమో! నమో క్రియేషన్స్ పతాకంపై అమిత్‌ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్, కాలకేయ ప్రభాకర్ నటీనటులుగా రవి చరణ్ ‌దర్శ‌కత్వంలో ఆర్‌.ఎమ్‌ నిర్మించిన చిత్రం “న‌ల్ల‌మ‌ల‌”. మార్చి 18 శుక్రవారం థియేటర్స్ లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులనుండి  హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా  చిత్ర బృందం హైదరాబాద్ లో నిర్మాణ సంస్థ కార్యాలయంలో పాత్రికేయుల
సమావేశంలో కేక్ కట్ చేసి సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రవి చరణ్ మాట్లాడుతూ.. ప్రేక్షకులందరికీ హొలీ శుభాకాంక్షలు. రెండు రాష్ట్రాల నుండి డిస్ట్రిబ్యూటర్స్ , ఫ్రెండ్స్ అందరూ కూడా సినిమా అద్భుతంగా ఉందని చెపుతున్నారు. ఆవు అమ్మ లాంటిది దాన్ని కాపాడు కోకపోతే మనుగడలేదు అనే కాన్సెప్ట్ తీసుకొని సినిమా తియ్యడం జరిగింది. మంచి కంటెంట్ కు మంచి ఆదరణ అంటే ఇదేనేమో అనిపించేలా ఈ రోజు ప్రేక్షకులు నిరూపించారు.సినిమా ఇంత బాగా రావడానికి ముందు మా నిర్మాత నాకెంతో సపోర్ట్ గా నిలిచారు. నటీనటులు అందరూ చాలా చక్కగా నటించారు. నా టెక్నికల్ టీం అంతా చాలా కష్టపడ్డారు..నా మొదటి సినిమాకే ఇంత ఆదరణ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా నల్లమల సినిమాను ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు.
హీరోయిన్ భానుశ్రీ‌ మాట్లాడుతూ.. మంచి కంటెంట్ తో విడుదలైన మా నల్లమల చిత్రం చాలా బాగుందని చాలా మంది ఫోన్స్ చేస్తున్నారు. ముఖ్యంగా “ఎమున్నావే.. పిల్లా ” సాంగ్ కు ప్రేక్షకులనుండి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది.ఆ సాంగ్ కంటే కూడా ఈ సినిమా చాలా బ్యూటీఫుల్ ఉంది.విజువల్స్ గాని, మేకింగ్,టేకింగ్ గాని అద్భుతంగా వచ్చాయి. సినిమాకు వచ్చిన ప్రతి ఒక్కరికీ మా సినిమా నచ్చుతుంది.
భారీ బడ్జెట్ తో నిర్మించిన ఇంత మంచి సినిమాలో నటించే  అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
నటీన‌టులు: 
అమిత్ తివారి, భానుశ్రీ‌, నాజ‌ర్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, అజ‌య్ ఘోష్‌, కాశీ విశ్వ‌నాథ్‌, కాల‌కేయ ప్ర‌భాక‌ర్‌, ఛలాకీ చంటి, శుభోద‌యం రాజ‌శేఖ‌ర్‌, చ‌త్ర‌ప‌తి  శేఖ‌ర్‌, ముక్కు అవినాష్‌, శేఖ‌ర్ అలీ, అరోహి నాయుడు, అసిరి శ్రీ‌ను
సాంకేతిక నిపుణులు
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవి చరణ్
నిర్మాత: ఆర్.ఎమ్
సినిమాటోగ్రఫీ: వేణు మురళి
సంగీతం, పాటలు: పి.ఆర్
ఎడిటర్: శివ సర్వాణి
ఆర్ట్:  పీవీ రాజు
ఫైట్స్: నబా
స్టైలిస్ట్‌: శోభ ర‌విచ‌ర‌ణ్‌
విఎఫ్ఎక్స్: విజయ్ రాజ్

పిఆర్ఓ – శ్రీ‌ను – సిద్ధు (Story: మంచి ఆదరణ అంటే ఇదేనేమో)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!