Homeటాప్‌స్టోరీమ్యూజిక్‌ సంచలనం మూగబోయింది!

మ్యూజిక్‌ సంచలనం మూగబోయింది!

మ్యూజిక్‌ సంచలనం మూగబోయింది!
ముంబయి : మ్యూజిక్‌ సంచలనం మూగబోయింది! మూస సంగీతానికి స్వస్తిచెప్పి, నృత్యాలకు ఉషారుతెప్పించిన బప్పీలహరి కన్నుమూశారు. బప్పీలహరి అంటేనే ఓ సంచలనం. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, రాజకీయ నాయకుడు, రికార్డు ప్రొడ్యూసర్‌ బప్పీలహరి ముంబయిలోని ఒక ఆసుపత్రిలో గుండెపోటుతో మృతిచెందారు. భారతీయ సంగీతానికి సింథసైజ్‌డ్‌ డిస్కో మ్యూజిక్‌ను పరిచయం చేసిన బప్పీలహరి సంగీతం అందించిన పాటలకు కుర్రకారు నేటికీ డ్యాన్సులు చేస్తారంటే ఆయన ప్రభావం భారతీయ సంగీతంపై ఎంతవుందో అర్థమవుతుంది. 1952 నవంబరు 27న పశ్చిమబెంగాల్‌ జల్‌పైగురిలో జన్మించిన బప్పీలహరి మంగళవారం రాత్రి తీవ్రమైన అస్వస్థతతో తుదిశ్వాస విడిచారు. వర్దాత్‌, డిస్కోడ్యాన్సర్‌, నమక్‌ హలాల్‌, షరాబీ, నయాకదమ్‌, మాస్టర్‌జీ, బేవఫాయ్‌, మక్సద్‌, సురాగ్‌, ఇన్సాఫ్‌ మే కరూంగా, డ్యాన్స్‌డ్యాన్స్‌, కమాండో, సాహెబ్‌, గ్యాంగ్‌లీడర్‌, సైలాబ్‌ వంటి సినిమాలకు ఆయన అందించిన సూపర్‌హిట్‌ సాంగ్స్‌కు నేటికీ వింటూనే వుంటాం. అమర్‌సంగీ, ఆశా ఓ భలోబాషా, ఆమర్‌ తుమీ, అమర్‌ప్రేమ్‌, మందిర, బద్నామ్‌, రక్తేలేఖా, ప్రియా వంటి బెంగాలీ సినిమాలకు స్వరాష్ట్రంలో సంగీత దర్శకత్వం వహించిన బప్పీలహరి నన్హా శికారీ (1973)తో హిందీ సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. 1970, 80, 90 దశకాల్లో బప్పీలహరి అంటే యువతకు ఓ పిచ్చి. ఆయన కెరీర్‌ మొత్తం డిస్కో స్టైల్‌తోనే నడిచింది. మిథున్‌ చక్రవర్తి నటించిన డిస్కో డ్యాన్సర్‌, డ్యాన్స్‌డ్యాన్స్‌ సినిమాలు యువతను ఊపేశాయి. కిశోర్‌కుమార్‌, మహమ్మద్‌ రఫీలను ఒకే సినిమాలో పాడిరచిన ఘనత ఆయనదే. ఎన్నో గజల్స్‌ను కూడా కంపోజ్‌ చేసి పేరుప్రఖ్యాతులు గడిరచారు. బాఫీు`3 ఆయన ఆఖరి సినిమా. విశేషమేమిటంటే, బప్పీలహరి హిందీ తర్వాత తెలుగు సినిమాలకు అధికంగా సంగీత దర్శకత్వం వహించారు. సింహాసనం సినిమాతో సూపర్‌స్టార్‌ కృష్ణ బప్పీలహరిని టాలీవుడ్‌కు పరిచయం చేశారు. ‘ఆకాశంలో ఒక తార…’ వంటి పాటలతో ఆ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత ఆయన ఏకంగా 26 తెలుగు సినిమాలకు సంగీతం అందించారు. అందులో సింహాసనంతోపాటు తేనె మనసులు, త్రిమూర్తులు, శంఖారావం, సామ్రాట్‌, కలెక్టర్‌ విజయ, మన్మథ సామ్రాజ్యం, స్టేట్‌రౌడీ, చిన్నా, చిన్నకోడలు, ఇంద్రభవనం, గ్యాంగ్‌లీడర్‌, రౌడీగారి పెళ్లాం, రౌడీ అల్లుడు, దొంగపోలీస్‌, రక్తతర్పణం, రౌడీ ఇన్‌స్పెక్టర్‌, బ్రహ్మ, నిప్పురవ్వ, రౌడీ రాజకీయం, బిగ్‌బాస్‌, ముద్దాయి ముద్దుగుమ్మ, ఖైదీ ఇన్‌స్పెక్టర్‌, పుణ్య భూమి నా దేశం సినిమాలకు సంగీతం అందించారు. యాక్షన్‌ త్రీడీ సినిమాకు తన కుమారుడు బప్పాలహరికి సహకారం, డిస్కో రాజా సినిమాలో ఒక పాట పాడారు. తెలుగులో ఎక్కువగా కృష్ణ సినిమాకు మ్యూజిక్‌ అందించారు. స్వతహాగా ఆయన గాయకుడు కూడా. చాలా సినిమాల్లో పాటలను ఆయనే స్వయంగా పాడేవాడు. మూడు తమిళ సినిమాలకు, ఐదు కన్నడ సినిమాలకు కూడా సంగీతం అందించారు. డిస్కోడ్యాన్సర్‌లో ఐయామ్‌ ఎ డిస్కో డ్యాన్సర్‌ పాట, డ్యాన్స్‌డ్యాన్స్‌లో జిందగీ మేరే డ్యాన్స్‌ డ్యాన్స్‌ పాటతో అతను దుమ్ములేపాడు. జిందగీ మేరే డ్యాన్స్‌డ్యాన్స్‌ పాటను 2017లో విడుదలైన డాడీ సినిమాలో కూడా తిరిగి వాడుకొని, మరో పెద్ద విజయం సాధించారు. విదేశాల్లో కూడా బప్పీలహరి పాటలకు మంచి క్రేజ్‌ ఉండేది. 1985లో షరాబీ సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును, 2018లో ఫిల్మ్‌ఫేర్‌ లైఫ్‌టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డును అందుకున్నారు. ది డర్టీ పిక్చర్‌ సినిమాలో ‘ఊ లలాలా’ పాటకు బెస్ట్‌ ఐటెమ్‌సాంగ్‌ మిర్చీ మ్యూజిక్‌ అవార్డును గెల్చుకున్నారు. కింగ్స్‌మన్‌ : ది గోల్డెన్‌సర్కిల్‌ హాలీవుడ్‌ మూవీకి, మవోనా యానిమేటెడ్‌ సినిమాకు డబ్బింగ్‌ కూడా చెప్పారు. 2014 ఎన్నికల్లో బీజేపీ తరపున లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయారు. (Story : మ్యూజిక్‌ సంచలనం మూగబోయింది!)

See Also : 25న వరుణ్ తేజ్ ‘గని’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!