వినుకొండలో పౌష్టికాహార మాసోత్సవాలు
న్యూస్‌తెలుగు/ వినుకొండ : వినుకొండ ప్రాజెక్టు పరిధిలోని ఏ సెక్టార్ నందు గల ఓబయ్య కాలనీ అంగనవాడి సెంటర్ నందు పౌష్టికాహారం మాసోత్వాల కార్యక్రమం నిర్వహించారు. ఈ పౌష్టికాహార మాసోత్సవం లో భాగంగా సిడిపిఓ ఎం అనురాధ మాట్లాడుతూ పౌష్టికాహారంతో రక్తహీనత నివారించవచ్చు అందుకే ముఖ్యంగా గర్భిణీలకు బాలింతలకు ప్రభుత్వం పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నాం. దీనివల్ల రక్తహీనతను తగ్గించడానికి మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ కృషి చేస్తుందని పౌష్టికాహారం ప్రయోజనాలు పుట్టబోయే బిడ్డల కోసం అని తెలిపారు. చిరుధాన్యాలు వాడకం అత్యవసరమని తెలిపారు. బిడ్డకు ఆరు నెలలు నిండిన తర్వాత తల్లిపాల తో పాటుగా పౌష్టికాహారం అందజేయడం జరుగుతుందని, దీన్ని సద్వినియోగపరుచుకోవాలని సిడిపిఓ తెలిపారు. మరియు తల్లిదండ్రులు చిన్నపిల్లలు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన దృష్టి కనబరచాలని తెలిపారు. పుట్టిన పిల్లలకు డబ్బా పాలు కాకుండా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి అన్నారు స్థానికంగా లభించే ఆకుకూరలు కూరగాయలు పండ్లు తీసుకున్నట్లయితే కిశోర బాలికలలో రక్తహీనత ఉండాలని సిడిపిఓ అన్నారు. అంతేకాకుండా పిల్లలకు కిశోర బాలికలకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే తల్లిదండ్రులు ఏరియాలోని మహిళా పోలీస్ కు లేదా అంగన్వాడీ కార్యకర్తకు తెలియజేయాలని, వినుకొండ పట్టణంలోని అన్ని అంగనవాడి కార్యకర్తలకు తెలియజేయాలని వినుకొండ పట్టణంలోని అన్ని అంగనవాడి సెంటర్ నందు పౌష్టికాహార ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి ఎం అనురాధ, ఎంఈఓ జఫరుల్లా ఖాన్, అంగన్వాడి టీచర్లు ప్రసన్న, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. (Story : వినుకొండలో పౌష్టికాహార మాసోత్సవాలు)

