కాచి చల్లార్చిన నీరు తాగండి
డాక్టర్ ఎం జ్యోతి
న్యూస్ తెలుగు/చాట్రాయి: భారీ వర్షాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీరు త్రాగాలని చాట్రాయి మండల వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఎం జ్యోతి తెలిపారు. జిల్లా కలెక్టర్ డీఎం అండ్ హెచ్ ఓల ఆదేశాల మేరకు మండలంలో వెల్నెస్ సెంటర్ల పరిధిలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. చీపురుగూడెం వైద్య శిబిరంలో ఆమె రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. వర్షాలు ప్రభావం వలన తాగునీరు కలుషితం అయ్యే అవకాశం ఉందని కలుషిత నీరు తాగితే అనారోగ్యాలకు గురవుతారని అందు వలన ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీళ్లను మాత్రమే తాగాలని వేడి వేడి ఆహార పదార్థాలు తినాలని సూచించారు. (Story: కాచి చల్లార్చిన నీరు తాగండి)