UA-35385725-1 UA-35385725-1

ఫోన్‌పేలో యూపీఐపై క్రెడిట్‌ లైన్‌ సౌకర్యం

ఫోన్‌పేలో యూపీఐపై క్రెడిట్‌ లైన్‌ సౌకర్యం

ముంబయి: ఫోన్‌పే కస్టమర్ల సౌలభ్యం కోసం మరో అడుగు ముందుకేసింది. తమ ప్లాట్‌ఫామ్‌లో యూపీఐ పేమెంట్లకు క్రెడిట్‌ లైన్‌ను ఎనేబుల్‌ చేసుకునే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చామని ప్రకటించింది. తమ బ్యాంక్‌ల నుండి క్రెడిట్‌ లైన్లు పొందే యూజర్లు ఇకపై వీటిని ఫోన్‌పేలో యూపీఐకి లింక్‌ చేయవచ్చు. దీంతో మర్చంట్లకు ఎప్పటికప్పుడు సజావుగా పేమెంట్లు చేసేందుకు వీలవుతుంది. ఈ ఫీచర్‌ వల్ల లక్షలాది మర్చంట్ల వద్ద కస్టమర్లు తాము చేసే కొనుగోళ్లకు సౌకర్యవంతంగా పేమెంట్లు చేయగలరు. అంతేగాక స్వల్పకాలిక క్రెడిట్‌ సౌలభ్యాన్ని వినియోగించుకుని, వాళ్ల నెలవారీ ఖర్చులను మెరుగ్గా మేనేజ్‌ చేసుకోగలుగుతారు. ‘యూపీఐపై క్రెడిట్‌ లైన్‌’ అని పిలిచే ప్రీ-అప్రూవ్డ్‌ క్రెడిట్‌ లైన్లను కూడా చేర్చుకునేలా భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ ఇటీవల యపీఐ పరిధిని విస్తరించింది. దీని వల్ల కస్టమర్లు తమ బ్యాంక్‌ల నుండి క్రెడిట్‌ లైన్లను పొంది, వాటిని తమ యూపీఐ యాప్‌లతో పేమెంట్లు చేయడానికి వినియోగించుకునే అవకాశం లభిస్తుంది. (Story : ఫోన్‌పేలో యూపీఐపై క్రెడిట్‌ లైన్‌ సౌకర్యం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1