గీతాంజలి రెసిడెన్షియల్ స్కూల్ నందు ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
న్యూస్‌తెలుగు/వినుకొండ :
స్థానిక వెన్నపూస కాలనీ నందు గల గీతాంజలి రెసిడెన్షియల్ స్కూల్ నందు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధులుగా డైరెక్టర్ శ్రీ. వై. శేషగిరి రావు విచ్చేసి చిన్నారులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు అందించారు. ప్రిన్సిపాల్ శ్రీమతి టి. కృష్ణవేణి మాట్లాడుతూ రెసిడెన్షియల్ స్కూల్ నందు విద్యాసంవత్సరం కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించడం ఎంతో ఆనందంగా వుంది అని ప్రతి ఒక్క విద్యార్థి శ్రీకృష్ణుని ఆదర్శంగా తీసుకొని చెడును విసర్జించి మంచి మార్గంలో నడవాలి అని కోరారు. అనంతరం చిన్నారులు ఉట్టి కొట్టే కార్యక్రమంలో చేసిన ప్రదర్శనలు చూపరులను విశేషంగా అలరించాయి. చిన్నారులకు ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించగా పోటీ పడి మరి పాల్గొన్నారు. కార్యక్రమంలో కారాస్పాండంట్ వై. యల్. కిషోర్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. (Story : గీతాంజలి రెసిడెన్షియల్ స్కూల్ నందు ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు)

