రైతు భీమాతో రైతుకు ధీమా
ఏవో రాజుల నాయుడు
న్యూస్‌తెలుగు/కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : రైతుభీమా తో రైతులకు ధీమా అని ఏవో రాజుల నాయుడు అన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తగా పట్టా పాసుబుక్ వచ్చి 18 సం”నుంచి 59 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్న రైతులు సంబంధిత ఏఈఓ లని సంప్రదించాలని తెలిపారు. ఆగష్టు 5 వ తేదీ లోపు సంప్రదించి రైతు భీమాలో నమోదు చేసుకోవాలని తెలిపారు. వ్యవసాయ అధికారులకు ఇవ్వాల్సిన పత్రాలు. కొత్త పట్టా పాసుబుక్,రైతు ఆధార్ కార్డు,నామినీ ఆధార్ కార్డు,రైతు భీమా నమోదు ఫారం తో జతపరిచి అందించాలని తెలిపారు. ఇట్టి అవకాశాన్ని అర్హులైన రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. (Story : రైతు భీమాతో రైతుకు ధీమా )