ఆదివారం ఆడిట్ ఆఫీస్ సార్ ఎందుకు వచ్చారు?
బురుగగూడెంలో ఏం జరుగుతుంది?
పంచాయతీ రికార్డులు తారుమారు చేస్తున్నారంటూ వదంతులు!
న్యూస్ తెలుగు /చాట్రాయి : ఆదివారం నాడు ఆడిట్ ఆఫీసర్ బురుగుగూడెం ఎందుకు వచ్చారు….? గంటల తరబడి ఆ కారు వైసీపీ ప్రముఖ నాయకుడు ఇంటి వద్ద ఎందుకు ఆగింది….? చాట్రాయి మండలంలోని పంచాయతీ రికార్డులు తారుమారు చేస్తున్నారట సామాజిక మాధ్యమాల్లో వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. చాట్రాయి మండలంలో అనేక పంచాయతీలో రికార్డులు సక్రమంగా లేవంటూ విచారించాలని పై అధికారులకు ఫిర్యాదులు వెళ్లిన నేపథ్యంలో నూజివీడు డివిజనల్ పంచాయతీ అధికారి చాట్రాయి మండలంలో కొన్ని పంచాయితీలకు షోకాజ్ నోటీసులు పంపించినా స్తానిక పంచాయితీ అదికారి సరిగా స్పందించకపోవడంతో జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాలతో విచారణ ప్రారంభించగా రికార్డులు సక్రమంగా లేకుండా గతంలో ఆడిట్ ఎలా చేశారనే విషయం బయటపడినట్లు తెలుస్తోంది. ఆదివారం నాడు ఆఫీసర్ వచ్చి గంటలు తరబడి బూరుగ గూడెం లో ఎందుకు ఉన్నారనేది బలమైన చర్చ జరుగుతుంది. గ్రామానికి జిల్లా అధికారి వచ్చినప్పుడు పంచాయతీ కార్యాలయానికి వెళ్లాలి మండలంలో మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లాలి ఏ విధమైన ప్రత్యేకత లేకుండా ఆడిట్ ఆఫీసర్ చర్చఏంటి అనేది ప్రశ్నర్థకం అయింది. (Story : ఆదివారం ఆడిట్ ఆఫీస్ సార్ ఎందుకు వచ్చారు?)