మరో ముగ్గురు ఎంపీల జంప్!
లావు, మాగుంటకు వైసీపీ టిక్కెట్ల నిరాకరణ
ఒంగోలు ఎంపీ మాగుంట గుడ్‌బై
అసంతృప్తితో వేమిరెడ్డి రాజీనామా
టీడీపీలో చేరికకు రంగం సిద్ధం
అమరావతి-న్యూస్ తెలుగు :
మరో ముగ్గురు వైసీపీ ఎంపీలు టీడీపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నెల్లూరు వైసీపీ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజీనామా చేశారు.వారి బాటలోనే తాజాగా ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి రాజీనామా చేశారు. నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయాలకు తిరిగి ఎంపీ టిక్కెట్‌ను ఇచ్చేందుకు వైసీపీ ఆధిష్టానం నిరాకరించింది. గుంటూరు వెళ్లి పోటీ చేయాలని కోరగా, అందుకు ఆయన ఆసక్తి చూపలేదు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఆధిష్టానం ఆయనతో దఫాలుగా చర్చించినా శ్రీకృష్ణదేవరాయాలు పట్టు వీడలేదు. తాను నరసారావుపేట నుంచే పోటీకి దిగుతానని తెగేసి చెప్పడంతో వైసీపీ వ్యతిరేకించింది. నరసారావుపేట ఎంపీతోపాటు ఆ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఓసీకి చెందిన వారున్నారు. దీంతో ఈ సారి నరసారావుపేట బరిలో బీసీని దించాలని వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇదే సమయంలో నెల్లూరు టౌన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పి.అనిల్‌కుమార్ యాదవ్‌కు, నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి మధ్య విభేదాలు నెలకొన్నాయి. నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్తులను మార్చాలంటూ వేమిరెడ్డి ఆధిష్టానానికి సూచించారు. అందులో నరసారావుపేట ఎంపీ అవసరం రీత్యా, అనిల్‌కుమార్‌ను నియమించారు. అనంతరం అక్కడ అనిల్ అనుచరుడు, నెల్లూరు డిప్యూటీ మేయర్‌ను ఆధిష్టానం ఇన్‌చార్జిగా ప్రకటించింది. నెల్లూరు టౌన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి తన భార్యను పోటీకి దించాలని ఆశించారు. అందుకు విరుద్ధంగా ఇన్‌చార్జిలను ప్రకటించడంపై వేమిరెడ్డి అసంతృప్తి చెందుతూ, కొంతకాలం పార్టీకి దూరంగా ఉన్నారు. ఆయనతో వైసీపీ కీలక నేతలు సంప్రదింపులకు ప్రయత్నించినా టచ్‌లోకి రాలేదు. టీడీపీ నేతలతో సమాలోచనలు చేస్తున్నారు. ఇటీవల వైసీపీకి, రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు.
ఈనెల 2వ తేదీన నెల్లూరులో జరిగే సభలో చంద్రబాబు సమక్షంలో వేమిరెడ్డి టీడీపీలో చేరే అవకాశాలున్నాయి. ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఇప్పటికే వైసీపీ టిక్కెట్టు లేదంటూ నొక్కిచెప్పింది. ఈయనకు టిక్కెట్టు ఇవ్వాలంటూ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులురెడ్డి కొంతకాలంగా ఆధిష్టానంపై ఒత్తిడి చేసినప్పటికీ ఫలించలేదు. వైసీపీ నుంచి మాగుంట కుమారుడుకు టిక్కెట్టు ఇవ్వాలని ప్రయత్నించడంతో అనేక కారణాల రీత్యా ఆధిష్టానం నిరాకరించింది. మాగుంటకు వైసీపీ నుంచి దారులు మూసుకుపోవడంతో టీడీపీ నేతలతో సంప్రదింపులు చేపట్టారు.
టీడీపీ, బీజేపీ పొత్తులు కుదిరితే, బీజేపీలోకైనా ఆయన వెళ్లనున్నారు. ఈ ముగ్గురు ఎంపీలు దాదాపు టీడీపీలో చేరేందుకు సానుకూల వాతావరణం ఏర్పాటు చేసుకున్నారు. వారిలో వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరతారని సమాచారం. ఇప్పటికే మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేనలో చేరారు. వైసీపీలో టిక్కెట్లు దక్కని వారంతా తమ రాజకీయ భవిష్యత్ కోసం పక్కదారులు పడుతున్నారు. అదే సమయంలో టీడీపీలో టిక్కెట్లు లభించని వారూ వైసీపీ వైపు దిక్కులు చూస్తున్నారు. (Story: మరో ముగ్గురు ఎంపీల జంప్!)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!