గ్లోబల్ సిటిజన్ స్కాలర్షిప్ 2027 కోసం దరఖాస్తుల ఆహ్వానిస్తోన్న గ్లోబల్ స్కూల్స్
సింగపూర్ స్మార్ట్ క్యాంపస్ లో 11, 12 తరగతుల చదువుకు పూర్తి ఆర్థిక సహకారం
న్యూఢిల్లీ, నవంబర్ 19: ప్రతిభావంతులైన విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించేందుకు గ్లోబల్ స్కూల్స్ గ్రూప్ (జీఎస్జీ) తమ ప్రతిష్ఠాత్మక ‘గ్లోబల్ సిటిజన్ స్కాలర్షిప్ (జీసీఎస్)–2027’ కార్యక్రమానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ స్కాలర్షిప్ ద్వారా ఎంపికైన విద్యార్థులు సింగపూర్‌లోని జీఐఐఎస్ స్మార్ట్ క్యాంపస్‌లో 11, 12 తరగతులు పూర్తి చేయవచ్చు. రెండేళ్లపాటు చదువుకు అవసరమైన పూర్తి ఖర్చులను సంస్థ భరిస్తుంది.
దేశవ్యాప్తంగా పదో తరగతి చదువుతున్న అర్హులైన విద్యార్థులను ఈ స్కాలర్షిప్కు ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి 100 శాతం ట్యూషన్ ఫీజుతో పాటు వసతి, భోజనం, ఇతర జీవన ఖర్చులను అందిస్తారు. అదనంగా స్టైపెండ్ కూడా చెల్లిస్తారు. దీంతో ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా విద్యార్థులు తమ చదువుపై దృష్టి సారించే అవకాశం కలుగుతుంది. ఎంపికైన విద్యార్థులు సింగపూర్‌లోని జీఐఐఎస్ స్మార్ట్ క్యాంపస్‌లో సీబీఎస్ఈ లేదా ఇంటర్నేషనల్ బాకలారియేట్ డిప్లొమా ప్రోగ్రామ్ (ఐబీడీపీ)లో చదువుకునే అవకాశం ఉంటుంది.
ఈ సందర్భంగా గ్లోబల్ స్కూల్స్ గ్రూప్ చైర్మన్, సహ వ్యవస్థాపకుడు అతుల్ తెముర్నికర్ మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితులు ప్రతిభావంతులైన విద్యార్థుల ఆశయాలకు అడ్డంకిగా మారకూడదన్నదే ఈ స్కాలర్షిప్ లక్ష్యమన్నారు. అంతర్జాతీయ దృక్పథం, స్వతంత్ర ఆలోచనా విధానం కలిగిన యువతను తీర్చిదిద్దడంతో పాటు సమాజానికి అర్థవంతమైన సేవలందించేలా వారిని ప్రోత్సహించాలనుకుంటున్నామని తెలిపారు.
జీఎస్జీ డైరెక్టర్ (అకడమిక్స్) ప్రమోద్ త్రిపాఠి మాట్లాడుతూ ప్రతిభ, పట్టుదలకు ఆర్థిక పరిస్థితులు పరిమితులు విధించకూడదన్న నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అంతర్జాతీయ విద్యా అవకాశాలను అందించడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నైపుణ్యాలు, విస్తృత దృక్పథాన్ని పెంపొందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 20, 2026 లోపుగా తమ దరఖాస్తులు జీసీఎస్–2027 దరఖాస్తు ఫారం ద్వారా పంపవలసి ఉంటుంది. విద్యార్థులకు రాత, మౌఖిక పరీక్షలతో కూడిన సమగ్ర ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. విద్యా ప్రతిభతో పాటు నాయకత్వ సామర్థ్యం, సాధించిన విజయాలు, సమగ్ర అభివృద్ధిపై ఆసక్తి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అర్హులను ఎంపిక చేస్తారు. (Story: గ్లోబల్ స్కూల్స్ గ్లోబల్ సిటిజన్ స్కాలర్షిప్కు దరఖాస్తుల ఆహ్వానం)
-
Top Stories You Can See
- అందం మీ సొంతం: సహజ నిగారింపుకు 6 పోషకాలు!
- బాదం పప్పులు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?
- మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
- వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
- దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
- ఆ చేప కన్పిస్తే…సునామీనే!
- ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్ ఒకేసారి గర్భం దాల్చారు!
-
మల్లెపూలతో తెల్లార్లూ…!

