Homeవార్తలు‘ఐపేవ్’కు సీఆర్ఆర్ఐ ధ్రువీకరణ పొందిన ఏఆర్ఆర్‌బీ సిస్టమ్స్ ఇండియా

‘ఐపేవ్’కు సీఆర్ఆర్ఐ ధ్రువీకరణ పొందిన ఏఆర్ఆర్‌బీ సిస్టమ్స్ ఇండియా

‘ఐపేవ్’ (iPAVe)కు సీఆర్ఆర్ఐ (CRRI) ధ్రువీకరణ పొందిన ఏఆర్ఆర్‌బీ సిస్టమ్స్ ఇండియా; భారత రహదారుల రంగానికి సమగ్ర రోడ్ అసెస్‌మెంట్ టెక్నాలజీ పరిచయం

ఇండియన్ రోడ్ కాంగ్రెస్ 2026లో ప్రదర్శించిన ‘ఐపేవ్’.. నెట్‌వర్క్ సర్వే వెహికల్, ట్రాఫిక్ స్పీడ్ డిఫ్లెక్టోమీటర్ మరియు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ టెక్నాలజీలను ఒకే వాహనంలో అనుసంధానించిన దేశంలోనే ఏకైక సమగ్ర వేదిక.

హైదరాబాద్, నవంబరు 19, 2026: భారతదేశ రహదారి మౌలిక సదుపాయాల మదింపు వ్యవస్థలో ఒక కీలక పరిణామంగా..ఆస్ట్రేలియా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ‘ఏఆర్ఆర్‌బీ సిస్టమ్స్’ భారతీయ విభాగమైన ‘ఏఆర్ఆర్‌బీ సిస్టమ్స్ ఇండియా’, తన ‘ఇంటెలిజెంట్ పేవ్‌మెంట్ అసెస్‌మెంట్ వెహికల్’ (ఐపేవ్)కు సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఆర్ఆర్ఐ) నుండి విజయవంతంగా ధ్రువీకరణ పొందినట్లు ప్రకటించింది. ఒకే వాహనంలో బహుళ రహదారి సర్వే సామర్థ్యాలను అందుబాటులోకి తెచ్చే ఈ సమగ్ర పరిష్కారాన్ని వాణిజ్యపరంగా వినియోగంలోకి తీసుకురావడానికి ఈ ధ్రువీకరణ ఒక ముఖ్యమైన ముందడుగు.

భారతదేశంలో రహదారుల నెట్‌వర్క్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో, రోడ్ల పైభాగపు స్థితిని మాత్రమే కాకుండా, వాటి అంతర్గత నిర్మాణ పటిష్టతన కూడా అంచనా వేయడం అత్యంత అవసరంగా మారింది. సాంప్రదాయకంగా, రహదారుల వివిధ అంశాలను పరిశీలించడానికి వేర్వేరు సర్వే సాంకేతికతలు, ప్రక్రియలు అవసరమయ్యేవి. ఈ సవాలును అధిగమించేందుకు ఏఆర్ఆర్‌బీ సిస్టమ్స్ ఇండియా రూపొందించిన ‘ఐపేవ్’, ఒకే సర్వే ఆపరేషన్‌లో రహదారి పనితీరు మరియు నిర్మాణ పటిష్టత రెండింటినీ మదింపు చేసే సమగ్ర వేదికగా పనిచేస్తుంది.

భారతదేశంలో ఒకే సమగ్ర వాహనంలో ఈ స్థాయి రోడ్ అసెస్‌మెంట్ టెక్నాలజీల కలయికను అందిస్తున్న ఏకైక సంస్థ ఏఆర్ఆర్‌బీ సిస్టమ్స్ ఇండియా మాత్రమే. పేవ్‌మెంట్ ఇంజనీరింగ్, రోడ్ సర్వేయింగ్ మరియు ఆస్తుల నిర్వహణలో అంతర్జాతీయ అనుభవాన్ని జోడిస్తూ, ఐపేవ్ అత్యాధునిక సాంకేతికతను భారత మార్కెట్‌లోకి తీసుకువస్తోంది. ఈ వేదిక ప్రధానంగా మూడు కీలక సామర్థ్యాలను ఒకే చోటకు చేర్చుతుంది:

  1. నెట్‌వర్క్ సర్వే వెహికల్ (ఎన్ఎస్వి): ఇది రహదారి పైభాగపు స్థితిగతులను మరియు పనితీరు ప్రమాణాలను నమోదు చేసి,రహదారి నెట్‌వర్క్ నాణ్యతను క్రమబద్ధంగా అంచనా వేయడానికి వీలు కల్పిస్తుంది.
  2. ట్రాఫిక్ స్పీడ్ డిఫ్లెక్టోమీటర్ (టిఎస్డి): వాహనాల రాకపోకల రద్దీ మధ్య రహదారిపై పడే భారాన్ని కొలవడం ద్వారా రోడ్డు నిర్మాణ పనితీరును అంచనా వేస్తుంది. తద్వారా నిర్మాణపరమైన బలహీనతలను గుర్తించడానికి, రహదారి బరువును మోసే సామర్థ్యాన్ని మదింపు చేయడానికి ఇది తోడ్పడుతుంది.
  3. గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జిపిఆర్): రాడార్ సాంకేతికతను ఉపయోగించి రహదారి భూగర్భ లక్షణాలను విశ్లేషిస్తుంది.రహదారి లోపలి పొరలు మరియు వాటి నిర్మాణ వివరాలపై స్పష్టమైన సమాచారాన్ని అందిస్తుంది.

ఈ మూడు సామర్థ్యాలను అనుసంధానించడం ద్వారా, ఏఆర్ఆర్‌బీ ఐపేవ్ ఒకే సర్వే వేదిక ద్వారా రహదారి పటిష్టతకు సంబంధించిన పూర్తి చిత్రాన్ని రహదారి సంస్థలకు అందిస్తుంది. ఆధారాలతో కూడిన, నిర్దిష్ట రహదారి నిర్వహణ విధానాలకు మద్దతు ఇచ్చేలా దీనిని రూపొందించారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఎఐ), కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH), రాష్ట్ర ప్రజా పనుల శాఖలు (PWDs) వంటి జాతీయ, రాష్ట్ర రహదారి సంస్థలతో పాటు మౌలిక సదుపాయాల డెవలపర్లు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లకు దీని సామర్థ్యాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

ఈ పరిణామంపై ఏఆర్ఆర్‌బీ సిస్టమ్స్ ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. “ఐపేవ్ విజయవంతంగా ధ్రువీకరణ పొందడం ఏఆర్ఆర్‌బీ సిస్టమ్స్‌కు ఒక ముఖ్యమైన మైలురాయి. ప్రపంచ స్థాయి అత్యాధునిక రహదారి మదింపు సాంకేతికతలను భారతదేశానికి తీసుకురావడంలో మా నిబద్ధతకు ఇది నిదర్శనం. ఈ ఒక్క సాంకేతికత ద్వారా అనేక స్వతంత్ర సర్వే ప్రక్రియలపై ఆధారపడాల్సిన అవసరాన్ని తగ్గించవచ్చు. డేటా సేకరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, రహదారి పైభాగపు పరిశీలనలను లోపలి నిర్మాణ స్థితిగతులతో అనుసంధానించడానికి ఇది సహాయపడుతుంది.

భారతదేశంలో రహదారి మౌలిక సదుపాయాలు విస్తరిస్తున్న కొద్దీ, సమగ్రమైన, డేటా ఆధారిత పరిష్కారాల అవసరం మరింత పెరుగుతోంది. బహుళ సర్వే సామర్థ్యాలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా.. భారత రహదారి సంస్థలు నిర్వహణ ప్రణాళికలను బలోపేతం చేసుకోవడానికి, మరమ్మతు పనులకు ప్రాధాన్యత ఇవ్వడానికి మరియు మౌలిక సదుపాయాల పెట్టుబడులపై మరింత స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది తోడ్పడుతుందని మేము విశ్వసిస్తున్నాము. ప్రభుత్వ సంస్థలు మరియు ఇతర భాగస్వాములతో కలిసి పనిచేయడానికి మేము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము” అని పేర్కొన్నారు.

దీనికి కొనసాగింపుగా ఏఆర్ఆర్‌బీ సిస్టమ్స్ ఇండియా డైరెక్టర్ అయాచి గుప్తా మాట్లాడుతూ.. “ఆర్థిక వృద్ధికి, సామాజిక అభివృద్ధికి మరియు నూతన అవకాశాలను అందుకోవడానికి రహదారి మౌలిక సదుపాయాలు ఒక ప్రధాన చోదక శక్తిగా పనిచేస్తాయి. భారతదేశం తన రహదారి నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్న తరుణంలో.. నాణ్యత, భద్రత మరియు దీర్ఘకాలిక మన్నికపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సమస్యలు తీవ్రం కాకముందే ముందస్తుగా రహదారులను మదింపు చేయడానికి, సంభావ్య లోపాలను ముందుగానే గుర్తించడానికి మరియు సరైన నిర్వహణ నిర్ణయాలు తీసుకోవడానికి ఐపేవ్ వంటి అత్యాధునిక సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తాయని ఏఆర్ఆర్‌బీ సిస్టమ్స్ ఇండియా విశ్వసిస్తోంది. భారతదేశం కోసం మరింత స్మార్ట్,సురక్షితమైన మరియు దీర్ఘకాలిక మన్నిక కలిగిన రహదారి నెట్‌వర్క్‌ను నిర్మించడంలో మద్దతు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము” అని తెలిపారు.

విజయవంతమైన ధ్రువీకరణ అనంతరం, దేశ రహదారి మౌలిక సదుపాయాల రంగంతో తన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఏఆర్ఆర్‌బీ సిస్టమ్స్ ఇండియా ఇప్పుడు ఐపేవ్‌ను వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. విస్తరిస్తున్న భారత రహదారి నెట్‌వర్క్‌లో మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి అత్యాధునిక పేవ్‌మెంట్ ఇంజనీరింగ్ సాంకేతికతను పరిచయం చేసే దిశగా కంపెనీ వేసిన మరో ముందడుగు ఇది.

కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, సుమారు 1.46 లక్షల కిలోమీటర్ల జాతీయ రహదారులతో భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఈ నెట్‌వర్క్ పరిమాణం,రహదారుల నాణ్యత, మన్నిక మరియు నిర్వహణపై పెరుగుతున్న దృష్టిని బట్టి చూస్తే.. మరింత సమగ్రమైన, సాంకేతికత ఆధారిత రహదారి మదింపు పరిష్కారాల ఆవశ్యకత స్పష్టమవుతోంది. జనవరి 2025 నివేదికకు ముందు మూడేళ్ల కాలంలో,జాతీయ రహదారుల నిర్వహణ మరియు మరమ్మతులపై సగటున ఏటా సుమారు రూ.6,000 కోట్లు ఖర్చు చేసినట్లు MoRTH వెల్లడించింది.

ఈ నేపథ్యంలో, ఏఆర్ఆర్‌బీ సిస్టమ్స్ ఇండియాకు చెందిన ఐపేవ్ వంటి సాంకేతికతలు రహదారుల క్షీణతను ముందుగానే గుర్తించడానికి, మరమ్మతు పనులకు ప్రాధాన్యత ఇవ్వడానికి మరియు మౌలిక సదుపాయాల పెట్టుబడులపై కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడానికి రహదారి అధికారులకు ఎంతగానో దోహదపడనున్నాయి.

ఏఆర్ఆర్‌బీ సిస్టమ్స్ ఇండియా గురించి: 

2018లో స్థాపించబడిన ఏఆర్ఆర్‌బీ సిస్టమ్స్ ఇండియా, అత్యాధునిక రోడ్ సర్వే పరికరాలు, పేవ్‌మెంట్ అసెస్‌మెంట్ టెక్నాలజీలు మరియు రోడ్ అసెట్ మేనేజ్‌మెంట్ పరిష్కారాలను అందించే అంతర్జాతీయ సంస్థ ‘ఏఆర్ఆర్‌బీ సిస్టమ్స్’ యొక్క భారతీయ విభాగం. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ‘ఏఆర్ఆర్‌బీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’, ‘హాక్ఐ’ ప్లాట్‌ఫారమ్ మరియు ‘ఐపేవ్’ టెక్నాలజీలకు అసలైన పరికరాల తయారీదారు మరియు యాజమాన్య హక్కులు కలిగిన సంస్థ. అత్యాధునిక రహదారి మదింపు మరియు డేటా ఆధారిత నిర్వహణ పరిష్కారాల ద్వారా రహదారి సంస్థలు, మౌలిక సదుపాయాల డెవలపర్లు మరియు కన్సల్టెంట్లకు ఈ సంస్థ తన సేవలను అందిస్తోంది. (Story: ‘ఐపేవ్’కు సీఆర్ఆర్ఐ ధ్రువీకరణ పొందిన ఏఆర్ఆర్‌బీ సిస్టమ్స్ ఇండియా)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments