ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు
న్యూస్తెలుగు/చింతూరు: ప్రభుత్వ డిగ్రీ కళాశాల చింతూరులో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ,తృతీయ సంవత్సరం విద్యార్థులు స్వాగతం పలుకుతూ ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.ఎన్.మణిమాల తెలిపారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ అధ్యక్షత వహించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కళాశాల జీవితంలో క్రమశిక్షణ పట్టుదల,సమయపాలన ఎంతో ముఖ్యమని తెలిపారు. నూతనంగా కళాశాలలో చేరిన విద్యార్థులు విద్యతో పాటు సాంస్కృతిక,సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కె.రమేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థి దశ జీవితంలో ఎంతో కీలకమైందని ఈ దశలో క్రమశిక్షణ అత్యంత అవసరమని సమయపాలనలో చదువుపై దృష్టి సారించాలని సూచించారు. డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ముల్లి.శేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు మంచి నడవడిక క్రమశిక్షణ అలవర్చుకొని తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని సూచించారు. జూనియర్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ బి.భరత్ మాట్లాడుతూ ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించడానికి విద్యార్థులు నిరంతరం కృషి చేయాలని తెలిపారు. సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు సహకరిస్తూ స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని తెలిపారు. ముఖ్య అతిథులను శాలువ,పుష్పగుచ్చములతో సత్కరించడం జరిగింది. అనంతరం విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యకలాపాలు ఆటపాటలు నృత్య ప్రదర్శనలతో అందరినీ అలరించారు. ఈ వేడుకలతో కళాశాలలో ఆనందోత్సవాలు వెల్లి విరిసాయి. ఈ కార్యక్రమం విద్యార్థులు మధ్య స్నేహభావాన్ని, ఐక్యతను పెంపొందిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఐ.క్యూ.ఏ.సి కోఆర్డినేటర్ డాక్టర్ వై. పద్మ, ఎం. రాకేష్ రాజ్, ఎం.దివ్య జ్యోతి, జె.శివకృష్ణ, కే. సత్య గణేష్, డా.జి.ఝాన్సీ, జి. సాయికుమార్, బి. శ్రీనివాసరావు, ఎన్. ఆనంద్, కే. లక్ష్మీ ప్రసన్నకుమారి, కే. కీర్తి, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. (Story: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు)
-
Top Stories You Can See
- అందం మీ సొంతం: సహజ నిగారింపుకు 6 పోషకాలు!
- బాదం పప్పులు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?
- మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
- వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
- దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
- ఆ చేప కన్పిస్తే…సునామీనే!
- ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్ ఒకేసారి గర్భం దాల్చారు!
-
మల్లెపూలతో తెల్లార్లూ…!

