పేమెంట్ కోసం పట్టు విడవని ‘పట్టు ‘కార్మికులు
కలెక్టర్, పిఓ ల హామీతో ధర్నా విరమణ
న్యూస్ తెలుగు/చింతూరు : పట్టు పరిశ్రమ వర్కర్స్ పెండింగ్ వేతనాలు చెల్లించాలని,పట్టు కాయలు పండించిన రైతులకు పెండింగ్ బకాయి సొమ్ము 1 కోటి 47 లక్షలు పైచిలుకు చెల్లించాలని చింతూరు ఐటిడిఏ వద్ద బుధవారం 7 గ్రామాల పట్టు పారిశ్రమ వర్కర్స్,రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా 3 సంవత్సరాల వేతన బకాయిలు,2 సంవత్సరాల రైతుల అమ్మినా పట్టుకయల సొమ్ము ఇవ్వాలని నినాదాలు ఇస్తున్నా సందర్భంగా ఐటిడిఏ పిఓ గ్రీవెన్స్ నుండి బయటకు వచ్చి పట్టు పరిశ్రమ కార్మికుల సమస్యలు విని మీ సమస్య త్వరలోనే పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. అయిన సరే ఎర్రని ఎండను లెక్కచేయకుండా ఇలాంటి మాటలు చాలా విన్నామని పట్టు కార్మికులు ధర్నా విరమించపోవడం తో పి ఓ చరవాణి లో కలెక్టర్ తో మాట్లాడి పట్టు పారిశ్రమ వర్కర్స్ రైతులు తో ఐ టి డి ఏ పి ఓ ప్రత్యేక సమయం కేటాయించి వారి సమస్య పరిష్కరిస్థానని పి ఓ హామీతో పట్టు పారిశ్రమ వర్కర్స్ రైతులు ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో కొక్కెరపాటి రవీంద్ర, 7 గ్రామాల పట్టు పారిశ్రమ కూలీలు,రైతులు పాల్గొన్నారు.(Story : పేమెంట్ కోసం పట్టు విడవని ‘పట్టు ‘కార్మికులు )

