కోటప్పకొండలో మహాశివరాత్రి ఏర్పాట్లపై మంత్రులు, చీఫ్ విప్ జీవి సమీక్ష
న్యూస్ తెలుగు/వినుకొండ : పల్నాడు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని జరుగుతున్న తిరునాళ్ల ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి, మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తో కలిసి బుధవారం పరిశీలించారు. ముందుగా త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అధికారులతో కలిసి కొండపై జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, తదితరులు పాల్గొన్నారు.(Story : కోటప్పకొండలో మహాశివరాత్రి ఏర్పాట్లపై మంత్రులు, చీఫ్ విప్ జీవి సమీక్ష)

