బొల్లా “డొల్ల” మాటలను ‘ఛీ’ కొడుతున్న ప్రజలు
గిట్టుబాటు ధర ప్రశ్నించిన రైతుపై హత్యాయత్నం కేసు పెట్టించిన ఘనుడు బొల్లా..
నలుగురు సీఎంలతో ఉత్తమ అవార్డులు అందుకున్న చరిత్ర శివశక్తి బయోటెక్ కంపెనీది*
కంపెనీపై అసత్య ప్రచారం చేస్తే పరువు నష్ట ధావ వేస్తా
న్యూస్ తెలుగు/వినుకొండ : బొల్లా అహంకారానికి, అసత్య ప్రచారాలకు వినుకొండ నియోజకవర్గ ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, బొల్లా ‘డొల్ల’ మాటలు మానుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఘాటుగా హెచ్చరించారు. టిట్కో ఇళ్ల వద్ద సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఐదేళ్ల పాలనలో బొల్లా బ్రహ్మనాయుడు వ్యవహరించిన నియంత పోకడకి, అహంకారం, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడి ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించి తగిన విధంగా బుద్ధి చెప్పారని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున్న పారదర్శకత పాలన, ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని చూసి వైసిపి వెన్నులో వణుకు పుట్టిందని, నియోజకవర్గం లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి బొల్లా బ్రహ్మనాయుడు భయపడుతూ ప్రజలు పూర్తిగా అతనిని మరిచిపోతారేమోనని ఉనికి కోసం ప్రభుత్వంపై, ప్రజా ప్రతినిధులపై అసత్య ప్రచారంతో బురద తల్లుతూ నోరు పారేసుకుంటున్నాడని ఆగ్రహించారు. ఈ ఏడాది రైతులకు సరిపడా యూరియా, డిఏపి ఎరువులు సకాలంలో అందించి కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసి రైతుల మన్ననలు పొందిందన్నారు. ఎక్కడ రైతులకు లేని సమస్య బొల్లా బ్రహ్మనాయుడు కి రావటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగతంగా నిరాధారణమైన ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. శివశక్తి బయోటెక్ కంపెనీ పై చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. నీతి నిజాయితీకి శివశక్తి బయోటెక్ కంపెనీ మారుపేరని, నలుగురు సీఎంలతో బెస్ట్ ప్రొడక్షన్ అవార్డులను శివశక్తి బయోటెక్ అందుకున్న చరిత్ర ఉందని తెలిపారు. కంపెనీపై అసత్య ప్రచారాలు చేస్తే పరువు నష్టం దావా వేసి బొల్లా బ్రహ్మనాయుడు ని కోర్టుకు లాగుతానని హెచ్చరించారు. వైసీపీ పాలనలో బొల్లా బ్రహ్మనాయుడు నియంతల వ్యవహరించి పట్టణంలో టిడిపి ఫ్లెక్సీలు తొలగించడమే కాకుండా కక్షగా మార్చుకొని ఫ్లెక్సీలు కోసి వేసిన నీచమైన చరిత్ర కలదన్నారు. రోడ్డుకు అడ్డుగా ఇష్టానుసారంగా పెట్టిన ఫ్లెక్సీలను అధికారులు తొలగిస్తే దానిని రాజకీయాలకు ఆపాదించి ఆరోపించడం సరికాదన్నారు. బ్రహ్మనాయుడు అసత్య ప్రచారాలు ఐదేళ్లు ప్రజలు విని మోసపోయారని, బొల్లా డొల్ల మాటలపై నియోజవర్గ ప్రజలు ఛీ కొడుతున్నారని అన్నారు. జిడిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ.. బొల్లా బ్రహ్మనాయుడు నిరాధారణమైన ఆరోపణలు, అసత్య ప్రచారాలు మానుకుని ప్రతిపక్ష పాత్ర పోషించాలని హితవు పలికారు. నోటికివచ్చినట్లు వ్యక్తిగతంగా విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. వినుకొండ నియోజకవర్గం లో భూ కబ్జాలు చేసింది నీవేనని, నరసరావుపేటలో ఏబీఎం ఆస్తులు కాజేసింది, వినుకొండలో నీవు ఉంటున్న ఇల్లు గ్రామ కంఠం గా ఉందని ఇలా చెప్పుకుంటూ పోతే బ్రహ్మనాయుడు అవినీతి అక్రమాలు కో కొల్లలుగా ఉన్నాయని అన్నారు. రైతులమంతా పాలు అమ్మితే వాటిల్లో నీళ్లు కలుపుకొని అమ్మి నీవు ఎంత అక్రమార్చన పొందావో మాకు తెలుసు అన్నారు. ఇప్పటికైనా వ్యక్తిగత ఆరోపణలు మానుకొని నియోజకవర్గ అభివృద్ధికి సూచనలు సలహాలు ఇస్తూ గౌరవం కాపాడుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు నాగ శ్రీను, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి షకీల, నిశ్శంకర శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.(Story : బొల్లా “డొల్ల” మాటలను ‘ఛీ’ కొడుతున్న ప్రజలు )

