మైనారిటీ యువతి పెండ్లికి రావుల చేయూత
న్యూస్‌తెలుగు/వనపర్తి : పిలిస్తే పలుకుతూ తెలిస్తే వస్తా అంటూ పదవి ఉన్నా లేకున్న నిత్యం ప్రజాసేవయే లక్ష్యం అంటూ ముందుకు సాగుతున్న మాజీ ఎం.పి రావుల.చంద్రశేఖర్ రెడ్డి ఒక పేద మైనార్టీ యువతి పెండ్లికి అండగా నిలిచారు. పట్టణములో 15వార్డుకు చెందిన చాంద్ బీ జైన్ టైలర్ కూతురు హసీనా వివాహం ఉన్నదని మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మాజీ ఎం.పి రావుల చంద్రశేఖరరెడ్డి దృష్టికి తీసుకురాగా స్పందించిన రావుల చంద్రశేఖరరెడ్డి 10వేల రూపాయలు వార్డు కౌన్సిలర్ బండారు.కృష్ణ చేతుల మీదుగా అందించారు.
కౌన్సిలర్ బండారు.కృష్ణ వ్యక్తిగతంగా 5000అందించారు. అదేవిధంగా జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ ఒక బస్తా బియ్యం,2వేలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమములో నందిమల్ల.అశోక్, బండారు.కృష్ణ,డాక్టర్.డ్యానియల్,సురేందర్,ఇలియాస్,త్యాహర్ తదితరులు పాల్గొన్నారు. (Story:మైనారిటీ యువతి పెండ్లికి రావుల చేయూత)

