గుండె ఆపరేషన్ బాధితుడికి LOC మంజూరు
వనపర్తి (న్యూస్ తెలుగు): వనపర్తి మండలం అచ్చుతాపురం గ్రామానికి చెందిన బోయ బక్క తిరుపతయ్య గుండె సంబంధిత సమస్యతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేసి ఒక స్టంటును అమర్చారు. మరో రెండు స్టంట్ లు అమర్చేందుకు ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల గ్రామ నాయకులు పాపిరెడ్డి ద్వారా విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కి ప్రభుత్వం తరఫున “రెండు లక్షల” రూపాయల విలువ గల LOC మంజూరు చేయించారు. మంజూరైన LOC పత్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. అత్యంత ఖరీదైన శాస్త్ర చికిత్సల్లో ఒకటైన గుండె సహాయం అందించి తమ కుటుంబానికి భరోసాగా నిలిచిన వనపర్తి ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. (Story: గుండె ఆపరేషన్ బాధితుడికి LOC మంజూరు)
See Also:
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!