వినుకొండ కోర్టు నందు ఈ నెల 13 వ తేదీన జాతీయ లోక్ అదాలత్
న్యాయమూర్తి యం. మహతి
న్యూస్ తెలుగు /వినుకొండ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, అమరావతి వారి ఆదేశాల మేరకు మండల న్యాయ సేవాధికార సంస్థ, వినుకొండ వారు ఈ నెల 13 వ తేదీన న రెండవ శనివారం నాడు వినుకొండ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వినుకొండ లోక్ అదాలత్ చైర్మన్ మరియు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టు న్యాయమూర్తి యం. మహతి తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్ నందు అన్నీరకాల సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంకు వివాద కేసులు, కుటుంబ వివాద కేసులు, మనోవర్తి వివాద కేసులు, రాజీపడధగిన క్రిమినల్ కేసులు, ముందస్తు రాజీచేసుకోదలచిన కేసులు మరియు ప్రీ లిటిగేషన్ కేసులు అనగా టెలిఫోన్ బిల్లులు, కరెంట్ బిల్లులు, వాటర్ బిల్లులు మొదలగు కేసులను రాజీ చేసి పరిష్కరించనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. ఎవరైనా కోర్టు పరిధిలో గల కక్షిదారులు తమ కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోడలచినచో నేరుగా తమను సంప్రదించాలని న్యాయమూర్తి కోరారు.(Story:వినుకొండ కోర్టు నందు ఈ నెల 13 వ తేదీన జాతీయ లోక్ అదాలత్ )

