ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో నిరంజన్ రెడ్డి
వనపర్తి (న్యూస్ తెలుగు) : ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతదేశం గర్వించే విధంగా ప్రజా సంక్షేమం ధ్యేయంగా హైందవ సంస్కృతిని పెంపొందించిని మహనీయుడు అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా జగదంబ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వయంగా వడ్డించి ఉత్సాహపరిచారు.అందరి సమక్షంలో వారితో పాటు భోజనం చేశారు. ఈ సందర్బంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసిన సాహసోపేతమైన నిర్ణయాలు సమాజానికి ఆదర్శంగా నిలిచాయి అని అన్నారు. ఈ కార్యక్రమములో అధ్యక్షులు పి.రమేష్ గౌడ్, వాకిటి. శ్రీధర్, కౌన్సిలర్స్ నాగన్న యాదవ్, పాకనాటి కృష్ణ, చెన్న రాములు, నాయకులు ఉంగ్లమ్మ్. తిరుమల్ల్, కృష్ణ, పరంజ్యోతి, గులాం ఖాదర్ ఖాన్, ప్రేమ్ నాథ్ రెడ్డి, సూర్యవంశం గిరి, ఎర్ర శ్రీనివాసులు, జానంపెట శ్రీను, జగదాంబ యూత్ సభ్యులు వినోద్ గౌడ్, నందిమల్ల సుబ్బు, గణేష్ గౌడ్, రాహుల్, పిట్టల వంశీకృష్ణ, శివగౌడ్, చీర్ల.రాజేందర్, శివ సాగర్ పాల్గొన్నారు. (Story: ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో నిరంజన్ రెడ్డి)
See Also:
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!