నవంబర్ 26న జిల్లా కేంద్రాల్లో నిర్వహించే కార్యక్రమాలను జయప్రదం చేయండి
న్యూస్‌తెలుగు/వనపర్తి : కేంద్ర ప్రభుత్వం రైతు, కార్మిక – ప్రజా వ్యతిరేక ,కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా నవంబర్ 26న జిల్లా కేంద్రాల్లో నిర్వహించే కార్యక్రమాలను జయప్రదం చేయాలని వనపర్తి లోని సీపీఐ ఆఫీస్ లో వాల్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది.ఈ కార్యక్రమంలో SKM రాష్ట్ర కన్వీనర్ జక్కుల వెంకటయ్య, సీపీఐ వనపర్తి పట్టణ కార్యదర్శి రమేష్, తెలంగాణ రాష్ట్ర రైతుసంఘం వనపర్తి జిల్లా ఉపాధ్యక్షులు పృథ్వీనాథం, కార్మిక సంఘం నాయకులు మహేష్, తదితరులు పాల్గొన్నారు.SKM రాష్ట్ర కన్వీనర్ జక్కుల వెంకటయ్య మాట్లాడుతూ కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా కేంద్ర ప్రభుత్వ రైతు కార్మిక వ్యతిరేక కార్పొరేట్ కంపెనీల అనుకూల విధానాలను వ్యతిరేకిస్తూ నవంబర్ 26న జిల్లా కేంద్రాలలో కార్యక్రమాలను జయప్రదం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. కార్పొరేట్ కంపెనీల దోపిడీకి వ్యతిరేకంగా, దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడాలని, పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయాలని నాలుగు లేబర్ కోడ్లలకు వ్యతిరేకంగా బ్లాక్ డేని పాటించడం, విద్యుత్ సవరణ బిల్లు 2025 ను ఉపసవరించాలని,రుణమాఫీ చట్టం చేయాలని, తదితర డిమాండ్లపై పోరాటాలను ఉధృతం చేసి నా,సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడం లాంటి అనేక కార్యక్రమాలను సంవత్సరాలుగా నిర్వహిస్తున్నా ,కేంద్ర పాలకులు స్పందించక పోగా కార్పొరేట్ అనుకూల విధానాలను బరితెగించి అమలు చేయటానికి పూనుకుంటున్నారు. కేంద్ర పాలకుల విధానాలకు వ్యతిరేకంగా నవంబర్ 26వ తారీకున జిల్లా కేంద్రాలలో జరుగు కార్యక్రమాలను జయప్రదం చేయటానికి అధిక సంఖ్యలో రైతులను, కార్మికులను ప్రజలను సమీకరించాల్సిందిగా సంయుక్త కిసాన్ మోర్చా విజ్ఞప్తి చేస్తుంది. పంటలకు మద్దతు ధరల చట్టం చేయాలని, రుణమాఫీ చట్టం చేయాలని ,విద్యుత్ సవరణ బిల్లు 2025 ను ఉపసంహరించాలని ,ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులు అమలు చేయాలని రోజుకు 700 వేతనం ఇవ్వాలని, అకాల ఏకదాటి వర్షాలకు నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఆహార పంటలకు ఎకరాకు 25 వేలు ఉ ద్యాన వాణిజ్య పంటలకు ఎకరాకు 50,వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, 2013 భూ సేకరణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, పంటలకు బోనస్ ఇవ్వాలని, లేబర్ కోడ్లను రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు చేయటానికి ముమ్మర ప్రయత్నం చేస్తున్న కేంద్ర పాలకుల విధానాలను వ్యతిరేకిస్తూ నవంబర్ 26వ తారీకున జిల్లా కేంద్రాలలో జరుగు కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరుతున్నాం.(Story:నవంబర్ 26న జిల్లా కేంద్రాల్లో నిర్వహించే కార్యక్రమాలను జయప్రదం చేయండి)

