ప్రజల మనిషి పేదల డాక్టర్ సోషలిస్ట్ అభ్యుదయ భావాలు కలిగిన అపర మేధావి
న్యూస్తెలుగు/వనపర్తి : డాక్టర్.బాలకిష్టయ్య గారి శతజయంతి సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు,నాయకులు, కార్యకర్తలు కలసి జనరల్ ఆసుపత్రి నందు కాంస్య విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్.బాలకిష్టయ్య గారు తన జీవితకాలం పేదల పక్షాన నిలబడి సేవలు అందించిన మహోన్నత శక్తి అని సోషలిస్ట్ అభ్యుదయ భావాలు కలిగి కాంగ్రెస్ వ్యతిరేఖ రాజకీయాలు చేశారని అన్నారు.
ప్రజలందరినీ తన కుటుంబ సభ్యులుగా భావిస్తూ వారి ఉన్నతికి,అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. స్వాతంత్ర సమరయోధుడుగా,సంఘసంస్కర్తగా సామాజిక న్యాయం,విద్యాపర్తిగా వనపర్తిని అభివృద్ధి చేశారని కొనియాడారు. ప్రజా డాక్టరుగా కొనసాగుతూ పట్టణ అభివృద్ధి సంస్థ స్థాపించి ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి సర్పంచిగా,మున్సిపల్ చైర్మెన్ గా పట్టణాన్నికి మంచినీటి సౌకర్యం,మౌలిక వసతులు,ఎందరికో ఉద్యోగాలు కల్పించి వనపర్తి పితామహునిగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు.
ఎం.ఎల్.ఎగా మండలానికి జూనియర్ కళాశాల , మహిళా జూనియర్ కళాశాల,డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి తోడ్పడ్డారని అన్నారు. ఈ కార్యక్రమములో కుటుంబ సభ్యులు డాక్టర్.భూపేష్,మాజీ ఐ.ఏ. యస్ దినకర్,మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రమిలమ్మ,మాజీ సర్పంచ్ జయంతి,సంజీవ్ ముదిరాజ్, సంజయ్,జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ పట్టణ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్,కురుమూర్తి యాదవ్ ,నందిమల్ల.అశోక్,బాల్ రామ్ సార్,వేణు రెడ్డి, స్వరాజ్యం సార్,వీరయ్య సార్,కృష్ణయ్య సార్,అమర్నాథ్,శంకర్ గౌడ్,బైరోజు.చంద్రశేఖర్,మాజీ జెడ్.పి.టి. సి రఘుపతి రెడ్డి,మాజీ కౌన్సిలర్స్ కాగితాల.లక్ష్మీనారాయణ,బండారు.కృష్ణ,నాగన్న యాదవ్,ఉంగ్లం. తిరుమల్,ప్రేమ్ నాథ్ రెడ్డి, ఇమ్రాన్,కె.మాణిక్యం,జాతృ నాయక్,జోహెబ్ హుస్సేన్,చిట్యాల.రాము,మంద రాము తదితరులు పాల్గొన్నారు. (Story:ప్రజల మనిషి పేదల డాక్టర్ సోషలిస్ట్ అభ్యుదయ భావాలు కలిగిన అపర మేధావి)

