Homeవార్తలుతెలంగాణసిపిఐ బస్సు జాతను జయప్రదం చేయండి : విజయ రాములు

సిపిఐ బస్సు జాతను జయప్రదం చేయండి : విజయ రాములు

సిపిఐ బస్సు జాతను జయప్రదం చేయండి : విజయ రాములు

న్యూస్‌తెలుగు/వనపర్తి : ఖమ్మంలో జరిగే సిపిఐ వందేళ్ళ ముగింపు సభ సందర్భంగా ఈనెల15న జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రారంభమైన బస్సు ప్రచార జాత అదేరోజు మధ్యాహ్నం వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రానికి చేరుకుంటుంది ఆ జాతను జయప్రదం చేయాలని కరపత్రాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ రాములు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జాతాలో సిపిఐ పార్టీ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం,రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాల నరసింహ చేస్తున్నారన్నారు. వనపర్తి జిల్లాలో పెబ్బేరు,వనపర్తి, కొత్తకోట,మదనాపురం, ఆత్మకూరు,అమరచింత 6మండలాలలో ఈ జాత పర్యటిస్తూ సిపిఐ వందేళ్ళ త్యాగాలను, పోరాట చరిత్రను, సాధించిన హక్కులను, విజయాలను వివరిస్తూ ప్రజల, కార్మికుల, రైతుల సమస్యలను ఏ విధంగా పరిష్కారం కోసం పోరాటం చేయాలో ప్రజలకు వివరిస్తూ వెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రమేష్ నాయకులు శ్రీనివాసులు,పెద్ద మొగులయ్య, శాంతమూర్తి, రిక్షా రాములు, చంద్రయ్య, రాములు, గోవిందు, బాలస్వామి, రవి తదితరులు పాల్గొన్నారు.(Story :సిపిఐ బస్సు జాతను జయప్రదం చేయండి : విజయ రాములు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!