Homeవార్తలుతెలంగాణనూతన బాధ్యతల్లో క్రమశిక్షణ, సమర్ధతతో ముందుకు సాగాలి

నూతన బాధ్యతల్లో క్రమశిక్షణ, సమర్ధతతో ముందుకు సాగాలి

నూతన బాధ్యతల్లో క్రమశిక్షణ, సమర్ధతతో ముందుకు సాగాలి

న్యూస్‌తెలుగు/వనపర్తి : గురువారం వనపర్తి సీసీఎస్ సీఐగా అశోక్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు అధికారిగా బాధ్యతలు నిర్వర్తించడం కేవలం విధి కాదు, అది ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం. సీసీఎస్ విభాగం నేర నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి దర్యాప్తులో వాస్తవాలను ఆధారంగా తీసుకుని పారదర్శకంగా, సమయపాలనతో వ్యవహరించాలి. ప్రజల విశ్వాసం పొందడం పోలీసు శాఖకు అత్యంత ముఖ్యమైనది. అశోక్ కుమార్ గారు గత అనుభవాన్ని వనపర్తి జిల్లాలో వినియోగించి సమర్ధత, క్రమశిక్షణతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని నేను ఆశిస్తున్నాను అన్నారు. అశోక్ కుమార్ ఇంతకుముందు హైదరాబాద్, రాచకొండ, సంగారెడ్డి జిల్లాలో విధులు నిర్వహించి వనపర్తి జిల్లాకు బదిలీపై వచ్చి గురువారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. (Story:నూతన బాధ్యతల్లో క్రమశిక్షణ, సమర్ధతతో ముందుకు సాగాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!